Health: సాధారణంగా చాలామంది ఇళ్ళల్లో బొద్దింకలు తెగ తిరుగుతుంటాయి. చైనాలో ఈ బొద్దింకలను ఆహార పదార్థంగా తీసుకుంటుంటారు. కానీ, మన ఇండియాలో మాత్రం వీటిని చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని చెప్పే వారూ చాలామంది ఉన్నారు. చిన్న పిల్లలు వీటిని చూసి ఎక్కువగా భయపడుతుంటారు. చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళలో కూడా చాలామందికి ఈ బొద్దింకలను చూస్తే దడపుడుతుంది. బొద్దింకల వల్ల ప్రాణ హాని లేదని తెలిసినా కూడా ఎందుకో అవి కళ్ళ ముందు తిరుగుతుంటే చీదర వేస్తుంది. చీకటి, తేమ, వెచ్చగా ఉన్న ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి.
బొద్దింకలలో నాలుగు జాతులుంటాయి. ఇవి ఎక్కువగా మానవ సంచారం ఉన్నచోటనే నివసిస్తుంటాయి. ఇక ఇది ఒంటి మీద పాకితే చికాకుగా అనిపిస్తుంది. అయితే, బొద్దింకలను నివారించడానికి కెమికల్స్ ఉన్నాయి. స్ప్రే కొడితే బొద్దింకలు పారిపోతాయి. ఇక సమూహాలుగా ఉన్న వాటిపై కొడితే కొన్ని అక్కడికక్కడే చనిపోతాయి. కొన్ని పారిపోతాయి. మళ్ళీ వాటి స్థావరాల నుంచి మరికొన్నిటిని ఉత్పత్తి చేసి ఇంటి పరిసర ప్రాంతాలలోనే తిరుగుతుంటాయి. అయితే, బొద్దింకలను చంపకుండా మన పరిసరాలకు దూరంగా పంపేందుకు వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది.
మనం అన్ని రకాల వంటలలో వెల్లుల్లిని నేరుగానూ లేదా పేస్ట్‌గా చేసీ ఉపయోగిస్తాము. వెల్లుల్లిని పొట్టు ఒలిచి నేరుగా తినేవారూ ఉన్నారు. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంతకముందు కంటే కరోనా వేవ్స్ వచ్చినప్పటి నుంచి వెల్లుల్లిని పొట్టు తీసి పచ్చిదే తినేవారు బాగానే తయారయ్యారు. కొందరు ఫ్రై చేసుకొని తింటుంటారు. ఇది మనం తినేందుకే కాదు, బొద్దింకలను మన పరిసరాల నుంచి దూరంగా పంపేందుకు కూడా ఎంతగానో తోడ్పడుతుంది.
వెల్లుల్లిని బాగా ఎండబెట్టి దానిని పొడిగా చేసి ఇంట్లో గానీ, ఇంటి పరిసరాలలో గాని ఎక్కడైతే బొద్దింకలు సంచరిస్తుంటాయో అక్కడ వెల్లుల్లి పౌడర్‌ను చల్లితే ఆ వాసనకు దరిదాపుల్లోకి కూడా బొద్దింకలు రావు. ముఖ్యంగా వాష్ బేసిన్ వద్ద, కిచెన్ సింక్, వాష్ రూమ్ చుట్టుపక్కల, డ్రైనేజీ పైప్స్ వద్ద ఎక్కువగా ఈ బొద్దింకలు తిరుగుతుంటాయి. అలాంటి ప్లేస్‌లలో వెల్లుల్లి ఎండబెట్టిన పౌడర్‌ను చల్లితే బొద్దింకలు రాకుండా నివారించవచ్చు. ఇక వెల్లుల్లి పొట్టును కూడా దీనికి నివారినిగా ఉపయోగించవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.