Tirumala Laddu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. మన భారతదేశంలో మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. నిత్యం భక్తులతో తిరుమల గోవింద నామస్మరణలతో మారుమోగుతోంది. ఇకపోతే మన భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా శ్రీవారి ఆలయాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ స్వామివారి లడ్డు భారీ స్థాయిలో వేలంపాటలో అమ్మడు పోవడం ప్రస్తుతం సంచలనగా మారింది.
టెక్సాస్‌లోని అలెన్ నగరంలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక అద్భుతమైన ఘట్టం జరిగిందని తెలుస్తుంది. ఇలా స్వామివారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా వెంకటరమణ అనే భక్తుడు పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ $777,777 ధరకు వేలంలో దక్కించుకున్నారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏకంగా 7.4 కోట్ల రూపాయలకు ఈ లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారని చెప్పాలి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా టెక్సాస్‌లో శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఈ స్థాయిలో డిమాండ్ ఉండడం చూసిన భక్తులు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ భారీ దరకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న భక్తుడు వెంకటరమణ భక్తికి ఫిదా అవ్వడమే కాకుండా ఆయన కుటుంబాన్ని స్వామివారు చల్లగా చూడాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా శ్రీవారి లడ్డు ప్రసాదం ఈ స్థాయిలో అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.