Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో బిజీ అవుతున్నారు. వారి ఉద్యోగ పనుల నిమిత్తం లేదా ఇంటి పనుల నిమిత్తం బిజీ అవుతూ అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా అదికి ఒత్తిడికి గురైన సమయంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనలో కోపం పెరిగిపోతూ ఉంటుంది ఆ కోపాన్ని వెంటనే మనం ఇతరులపై చూపిస్తాము ఇలా కోపం ఇతరులపై చూపించినప్పుడు ఆ కోపం తగ్గిపోయినప్పటికీ అవతలి వారు మన మాటల ద్వారా ఎంత బాధ పడతారో ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇలా కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా అవతలి వ్యక్తిని బాధపెడుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు కొన్ని చిట్కాలను పాటించడంతో ఈ కోపం తగ్గిపోతుందని చెప్పాలి.
కోపం వచ్చినప్పుడు పొరపాటున కూడా మీ పిల్లలను దూషించకండి. మీ కోపం మొత్తం పిల్లలపై చూపించడం వల్ల ఆ ప్రభావం వారిని మానసికంగా ఎంతో కృంగదీస్తుంది అందుకే కోపం వచ్చినప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకొని వారితో ఆడుకోవడం లేదా మీరు కాసేపు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్లిపోవడం చేయాలి. కోపం అధికంగా వస్తే కనుక వెంటనే వేగంగా నడవడం పరిగెత్తడం వంటివి చేయడం వల్ల కోపం క్షణాల్లో తగ్గిపోతుంది.
ఇక మీకు పట్టరాని కోపం కనుక వస్తే మీకు ఎంతో ఇష్టమైనటువంటి పనులను చేయటం వల్ల కూడా ఈ కోపం తగ్గిపోతుంది మ్యూజిక్ వినడం లేదంటే కొన్ని ఫన్నీ వీడియోలు వంటివి చూడటం వల్ల కోపం తగ్గిపోతుంది. అదేవిధంగా కోపం వచ్చినప్పుడు పొరపాటున కూడా ఎలాంటి డెసిషన్ చేసుకోకూడదు ఆ సమయంలో తీసుకొనే నిర్ణయం ఏదైనా సరే అది మనకు ప్రమాదకరంగానే ఉంటుంది.కనుక అలాంటి సమయంలో ఏమి మాట్లాడకుండా తరువాత ప్రశాంతంగా ఆ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది. ఇలా తరచూ కోప్పడటం వల్ల మనలో ఒత్తిడి ఎక్కువ జరిగి అది గుండెజబ్బులకు కూడా కారణం కావచ్చు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
This website uses cookies.