Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో మాత్రం ప్రకృతిలో ఉండే కొన్ని రకాల మొక్కలు వాటి పేర్లు ఉపయోగించి ప్రాణాంతక వ్యాధులను కూడా తగ్గించేవారు. ఇలా ఇప్పటికీ ప్రకృతిలో సహజంగా పెరిగే కొన్ని మొక్కలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మోదుగ చెట్టు కూడా ఒకటి. రోడ్ల పక్కన, అడవుల్లో విచ్చలవిడిగా పెరిగి ఈ చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దీన్ని ఔషధంగా మాత్రమే కాకుండా హోమ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. మోదుగ చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టు బెరడు కారం, చేదు, వగరుగా ఉంటుంది. మోదుగ చెట్టు కాడను దంచి దానిని పేస్ట్ లాగా చేసి మొలలపై రాసి కట్టు కడితే. మొలల సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే ఈ చెట్టు గింజలు తేలు కాటుకు విరుగుడుగా కూడా పని చేస్తాయి. మోదుగ చెట్టు గింజలను జిల్లేడు పాలతో కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు కాటు వల్ల కలిగే బాధ చాలా త్వరగా తగ్గుతుంది.
అలాగే పిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్యను తగ్గించడంలో కూడా ఈ మోదుగ చెట్టు ఎంతో సహాయపడుతుంది. మోదుగ చెట్టు విత్తనాలను పొడిగా చేసి ఈ పొడిని తేనెతో కలిపి పిల్లలకు ఇవ్వటం వల్ల నులి పురుగుల సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే నీళ్ళ విరేచనాలతో ఇబ్బంది పడేవారు చెట్టు జిగురును ఎండబెట్టి దానిని దంచి పొడిగా చేయాలి . 10 గ్రాముల మోదుగ జిగురు పొడి తో పాటు 10 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపిఈ మిశ్రమాన్ని మూడ పూటలా అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల నీళ్ల విరోచనాల సమస్య పూర్తిగా తగ్గుతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.