Health: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం (లివర్) ఒకటి. ఇది జీర్ణక్రియ, టాక్సిన్ల తొలగింపు, రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తి వంటి అనేక కీలక పనులను నిర్వహిస్తుంది. అయితే, జీవనశైలి లోపాలు, దుష్ప్రభావాల వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా, లివర్ చుట్టూ ద్రవం పేరుకునే పరిస్థితిని అసిటిస్ అంటారు. ఇది కాలేయ సంబంధిత తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా పరిగణించబడుతుంది.
ఈ సమస్య వచ్చినప్పుడు ముందుగా పొట్టలో వాపు స్పష్టంగా కనిపిస్తుంది. బిగుతుగా అనిపించడం, పొట్ట కిందకు వేలాడినట్లు కనిపించడం, మరియు బరువు ఒక్కసారిగా పెరగడం వంటి లక్షణాలు కనపడవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు, కాళ్ల వాపు, అలసట, చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు అసిటిస్‌ను సూచించవచ్చు.
అలాగే, ఆకలి మందగించడం, వికారం, నాభి బయటకు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇది నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచ్చు. అందుకే, ఏవైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు ద్వారా లివర్ పరిస్థితిని అంచనా వేయవచ్చు.
ఆరోగ్యవంతమైన లివర్ కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. మద్యాన్ని దూరంగా పెట్టడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి చర్యలు అనుసరించాలి. ఇది కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా చికిత్స ప్రారంభించేముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.