Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: వసుని టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్న రిషి.. రిషిధారల్ని చూసి హ్యాపీగా ఫీలవుతున్న జగతి, మహింద్ర!

Guppedantha manasu serial: పెళ్లి విషయం దాచినందుకు వసుధారతో సహా అందరి మీద కోపంతో ఉంటాడు రిషి. తనని కూల్ చేసేందుకు వసు ఫోన్ చేస్తుంది. కానీ రిషి కావాలని ఫోన్ కట్ చేస్తాడు. వసు కూడా ఏమాత్రం తగ్గకుండా మళ్లీ కాల్ చేస్తుంది. అపుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. నిద్రొస్తుంది అని చెప్తాడు. రిషి మీద కవిత్వాలు చెప్తూ కోపం తగ్గించే ప్రయత్నం చేస్తుంది వసు. కానీ కోపంతో ఫోన్ కట్ చేస్తాడు రిషి. మళ్లీ మళ్లీ కాల్ చేస్తూ విసుగిస్తుంది వసు. ఆ తర్వాత గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది.

మరుసటి రోజు ఉదయం జగతి, మహింద్రలు కాలేజికి వెళ్లి.. రిషి, వసుధారలు కలిసి కూర్చున్న ప్రదేశాన్ని చూస్తూ బాధపడతారు. రిషి ఇంకా కాలేజికి రాలేదని కంగారు పడుతుంది జగతి. అంతలోనే రిషి కారు బయల్దేరుతుంది. దారిలో కారుకు అడ్డంగా నిల్చుంటుంది వసు. రిషి సార్ వచ్చి లిఫ్ట్ ఇస్తా రా అని పిలిచేవరకు నేను వెళ్లనని మనసులో అనుకుంటుంది వసు. పొగరు అంటే ఇగో అని తిట్టుకుంటారు ఇద్దరూ. నాకు ఇగో ఉంది ముందు నేను మాట్లాడను అనుకుంటారు. కావాలని ఫోన్ చేసి మీటింగ్ ఉందని చెప్తాడు రిషి. వసు స్పీచ్ ఇస్తుందని చెప్పడంతో.. సడెన్‌గా మీటింగ్ ఏంటి సర్ అని అంటుంది వసు. ఆ తర్వాత కారు కాలేజిలో ఆగుతుంది. సీటు బెల్టు రావడం లేదు హెల్ప్ చేయొచ్చు కదా సర్ అని అడుగుతుంది వసు. ట్రై చెయ్ అంటాడు కానీ రిషి తీయడు. ఏంటి సర్ సాధిస్తున్నారా? అని అంటుంది వసు. చివరకు తనే దిగుతుంది వసు.

Guppedantha manasu serial:

Guppedantha manasu serial: మీటింగ్‌కు టైం అవుతుంది రెడీ అవమని చెప్తాడు రిషి. ఏం మాట్లాడాలి సర్ మీటింగ్‌లో అని అడుగుతుంది వసు. ప్రాజెక్ట్ హెడ్‌వి నవు్.. నేను కాదు… ఏం మాట్లాడాలో నువ్వే ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషి క్యాబిన్‌లో ఉన్న హార్ట్ సింబల్‌ని చూసి ‘ఇలా చేశావేంటి వసుధార’ అనుకుంటూ బాధపడతాడు. ఆ తర్వాత రిషి పెన్ తీసి ఎండీ అని రాస్తుండగా వసుధార వచ్చి చూస్తుంది. వసుని చూసి పక్కకు దాచుకుంటాడు రిషి. హార్ట్ మీద ఎండీ అని రాసుకున్నారేంటి సర్ అని అడగ్గా.. మరి నేను ఎండీనే కదా అంటాడు రిషి. అలా ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. అంతలోనే అక్కడికి జగతి, మహింద్రలు వస్తారు.

‘చూశారా సర్.. రిషి సార్ హార్ట్ మీద రాసుకున్నారు’ అని చెప్తుంది వసు మహింద్రతో. నా పెన్ నా ఇష్టం అంటాడు రిషి చిలిపిగా. వసు మాత్రం రిషిని ఎండీ అంటూ ఇరికిస్తుంది. నేమ్ బోర్డ్ రాసుకోవచ్చు కద రిషి అంటూ సలహా ఇస్తాడు రిషి. మీటింగ్‌కి టైం కాలేదా అని అడగ్గా.. ఇంకా మూడు నిమిషాలు ఉందంటుంది వసు. వాళ్ల గొడవని చూసి జగతి, మహింద్రలు రాంగ్ టైంలో వచ్చామంటూ వెళ్లిపోతారు. ఆ తర్వాత వసు వెళ్లిపోతుంది.

సీన్ కట్ చేస్తే.. దేవయాని రిషి తన చేజారి పోతాడని ఆందోళన చెందుతుంది. ఆ తర్వాత కాలేజిలో మీటింగ్‌కి అందరూ హాజరవుతారు. వసుతో వస్తున్న ఫణింద్ర సర్‌ని ఇక్కడ కూర్చోమని పిలుస్తాడు రిషి. ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి రిషి మాట్లాడతాడు. అపుడే వసుని కావాలని ఇరికిస్తాడు. ఈ ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్తుందని వసు గురించి చెప్తాడు. ఇపుడు ప్రాజెక్ట్ హెడ్ వసుధార మాట్లాడుతుందని చెప్తాడు రిషి. దాంతో వసులో కంగారు పెరుగుతుంది. వసు మరి మీటింగ్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

Savitha S

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.