Guppedantha manasu serial: రిషి, వసుధారలు కలవడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. జగతి, మహింద్రలు వసు ఇంటికెళ్లి మాట్లాడతారు. అపుడే రిషి వస్తాడు. వసుధార తన మెడలో తనే తాళి వేసుకుందని తెలిసినా.. చెప్పనందుకు తల్లిదండ్రుల మీద అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నేటి ఎపిసోడ్‌లో చూద్దాం..
వసు తన మెడలో తను తాళి వేసుకుందంటే ప్రపంచం నమ్ముతుందా? అని ప్రశ్నిస్తాడు రిషి. రిషిధారలు కలిసిపోయారని మీరు సంతోషంగా ఉన్నారు.. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైందని షాకిస్తాడు రిషి. వసుధార కొన్నింటిని మనం వెనక్కి తీసుకోలేం.. అంటాడు రిషి. ఆ సమయంలో నాకదే కరెక్ట్ అనిపించింది అంటుంది వసు. మెడలో తాళి వేసుకోవడం అంత ఈజీనా వసుధార. ఆ తాళిని నువ్ ఇప్పుడు తీయగలవా? చెప్పు వసుధార అని నిలదీస్తాడు రిషి. భవిష్యత్తులో పెళ్లి సంగతేంటో ఆలోచించావా? అంటాడు. అంటే నేనిప్పుడు తప్పు చేశానా సర్ అంటుంది వసు. నువ్ అనుకున్నంత చిన్న విషయం కాదు వసుధార ఇది. నన్ను ఒక చేతకాని వాడిలా నిరూపించాలనుకున్నావ్. ఫూల్‌గా మిగిలిపోయాను తెలుసా అంటూ బాధపడతాడు. వసుధార నువ్ చేసిన దాన్ని సమాజం సమర్థిస్తుందా? అని రిషి అడగ్గా.. నాకు మన బంధం ముఖ్యం. సొసైటీతో పని లేదంటుంది వసు. ఆ సమయంలో నన్ను నేను కాపాడుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు సర్ అని వసు ఎంత చెప్పినా రిషి వినిపించుకోడు.
Guppedantha manasu serial: నేను నిజం చెప్పాలని ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా మీరు నన్ను కసురుకున్నారని వసు అంటుంది. తప్పంతా చేసి ఇప్పుడు కూడా నన్నే తప్పంటున్నావా? అని రిషి ఎదురు ప్రశ్నిస్తాడు. నీ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికి ఏం చెప్తావ్ మరి? అని నిలదీస్తాడు. మన దగ్గర దాపరికాలు ఉండకూడదని నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా అంటూ వసు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రిషి. నిజం చెప్పడానికి నాకు టైం, ధైర్యం రెండూ లేవు సర్ అంటుంది వసు. అయినా రిషి ఒప్పుకోడు. పోలీసుల చుట్టూ పిచ్చోడిలా తిరిగాను. ఏదైనా అడిగితే ఈ తాళి నా ఇష్ట ప్రకారమే నా మెడలో పడింది సార్ అంటావు అని అరుస్తాడు. మిమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తే అలా చేయాల్సి వచ్చింది సర్ అంటుంది వసు. నీ ధైర్యం ఏమైంది వసుధారం అంటూ గతాన్ని గుర్తుకు చేస్తాడు రిషి.
‘సరే సర్ ఇవన్నీ పక్కన పెట్టండి. నేను మిమ్మల్ని కాకుండా వేరే వాళ్లని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటారు’ అని వసు రిషిని ప్రశ్నిస్తుంది. నేను నీ ప్రేమని వదులుకుంటానని నువ్ ఎలా అనుకున్నావ్ అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు రిషి. ఆ తర్వాత చక్రపాణి చేతిలో ఉన్న కాఫీ తాగి.. బాగుంది. కానీ చల్లారిపోయింది అని రిషి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మహింద్ర, జగతిలు రిషేంద్రభూషణ్ బ్యాటింగ్ స్టార్ట్ అయిందని కంగారుపడతాడు.
ఎవరూ చేయని సాహసం వసు చేసింది. ఆ తాళి వాళ్లిద్దరి మధ్య దూరం పెంచిందని జగతితో అంటాడు మహింద్ర. నువ్ తాళిబొట్టు పంపడం వల్లే ఇదంతా జరిగిందని మహింద్ర గుర్తుచేస్తాడు. అసలు రిషి వసుని క్షమిస్తాడంటావా? అని ప్రశ్నిస్తాడు మహింద్ర. ఇందులో మన ప్రమేయం లేదు మహింద్ర.. వాళ్లే తేల్చుకుంటారని అంటుంది జగతి. ఇంతకీ ఎవరు నెగ్గారు ఎవరు తగ్గారు? అంటాడు మహింద్ర. జగతి అర్థమయ్యేలా మహింద్రకు వివరిస్తుంది. త్వరలోనే వాళ్లు సర్దుకుని ఇంతకు ముందులా దగ్గరవుతారు. మీరు మాత్రం పెళ్లి, తాంబూలాలు అంటూ తొందరపాటు పనులు చేయకండని సూచిస్తుంది జగతి.
సీన్ కట్ చేస్తే.. రిషి ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తాడు. ధరణితో కూరలు బాగున్నాయని చెప్తాడు. కొడుకుని చూసి జగతి, మహింద్రలు సంబరపడిపోతాడు. దేవయాని మాత్రం తినకుండా కుళ్లుకుంటుంది. అమ్మా ధరణి.. ఇలాంటి సందర్భంలో భోజనంతో పాటు స్వీటు కూడా ఉంటూ బాగుంటుందని అంటాడు రిషి పెద్దనాన్న. ఇంకేం సంగతులు అంటూ అడుగ్గా.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్తాడు రిషి. ఛీ.. ఛీ ఎప్పుడు దాని గురించి తప్పా ఇంకేం ఉండవా అని అసహ్యించుకుంటుంది దేవయాని. అంతలోనే ధరణి స్వీటు తీసుకొస్తుంది. పెద్దమ్మా ముందు మీరు తినండి అంటూ స్వీటు తినపిస్తాడు రిషి.
ఆ తర్వాత సీన్‌లో వసు రిషి మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. రిషి ఫొటో చూసుకుంటూ మాట్లాడుతుంది. అక్కడ రిషి కూడా వసు గురించే ఆలోచిస్తాడు. వసుకు నా మీద కోపం వచ్చిందా? అనుకుంటాడు. అంతలోనే వసు రిషికి ఫోన్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.