Faima-Praveen : ఫైమా నా పిల్ల అనుకున్న..కానీ ఆమె నన్ను రిజెక్ట్ చేసింది

Faima-Praveen : ప్రవీణ్, ఫైమా వీళ్లిద్దరి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర పైన  ఎంటర్టైన్మెంట్ తో, కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వీరిద్దరు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక  బిగ్ బాస్ తర్వాత ఫైమాకు  మంచి క్రేజీ లభించింది. వరుస ఆఫర్లతో కెరీర్ లో ముందుకెళ్తుంది. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఈ తమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రకటించారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. పలు సందర్భాల్లో టీవీ స్టేజీల పైన కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరికి సంబంధించిన ఎలాంటి న్యూస్ ఇప్పుడు వినిపించడం లేదు.అయితే,ప్రవీణ్, ఫైమాలు బ్రేకప్ అయ్యారని వాళ్ళిద్దరూ ప్రస్తుతం లవ్ లో లేరన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ మొదటిసారిగా తమ రిలేషన్ గురించి స్పందించాడు.

faima-praveen-she-did-not-accepted-my-love-its-her-wish

” ఫైమా నేను మంచి ఫ్రెండ్స్.  మా ఫ్రెండ్ షిప్ తోనే మా రిలేషన్ ఏర్పడింది. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆమె నాతోనే ఉంది. అందుకే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాను.కానీ ఆమె నా ప్రేమను రిజెక్ట్ చేసింది. నా ఇష్టమేంటో చెప్పాను.  అది ఒప్పుకోవడం ఒప్పుకోకవడం ఆమె ఇష్టం. ఆమె నిర్ణయాన్ని నేనెప్పుడూ కూడా తప్పుపట్టను ఆమె నన్ను ప్రేమించక పోయినా నేను ఆమెతోనే ఉన్నాను.  ఓ స్నేహితుడిగా  ఆమెకు సహాయపడుతున్నాను. మా ఇద్దరి మధ్య లవ్ లేకున్నా మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాము. ఫ్రెండ్ లా ఆమె నాతో ఉన్నా కొన్నిసార్లు ఆమె నాకు నో చెప్పిందని బాదేసేది. ఒకానొక సమయంలో నేను బాగా ఏడ్చాను. ఎంతైనా ఫస్ట్ లవ్ ని అంత ఈజీగా మర్చిపోలేము కదా. అందుకే దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసాను.

లవ్ విషయం పక్కన పెడితే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నా ఫోకస్ అంతా ఇప్పుడు వాటిపైనే. వాటితోనే పోరాటం చేస్తున్నాను. ఈ మధ్యనే మా నాన్న చనిపోయారు. ఆయన చనిపోయాక చాలా విషయాలు తెలిసాయి.  నాకున్న అప్పులు ఎంతో తెలుసుకున్న. ఇప్పుడు అప్పులను తీర్చే పనిలోనే ఉన్నాను.  దేనిపైన నా దృష్టి లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఫైమా నన్ను ప్రేమిస్తున్నానని నా దగ్గరికి వస్తే తప్పకుండా  యాక్సెప్ట్ చేస్తా”.అని ప్రవీణ్ తెలిపాడు.

faima-praveen-she-did-not-accepted-my-love-its-her-wish

బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చాక సెలబ్రిటీ స్టేటస్ రాగానే ఫైమా ప్రవీణ్ ని పక్కన పెట్టేసిందని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఈ వార్తల పైన ప్రవీణ్ స్పందించాడు.”బిగ్ బాస్ షో నుంచి ఫైమా ఎలిమినేట్ అవ్వగానే బాగా ఫీల్ అయింది. కొన్ని రోజులు వరకు ఆమె ఎవరిని కలవలేదు. నాతో బాగానే మాట్లాడింది. ఫైమా షో లో ఉన్నప్పుడు బయటనుంచి నేను బాగా సపోర్ట్ చేశాను. నేను ఏ ప్రోగ్రాం చేసిన ఫైమాకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేసేవాడిని. ఫైమా నా పిల్ల అనుకుని నేను ఎంతో సపోర్ట్ చేశా. కానీ ఆమె నా లవ్ ని రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ నేను ఎప్పుడు ఆమెకు ఫ్రెండ్ గానే ఉంటాను”అని తెలిపాడు ప్రవీణ్.

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

7 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

7 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

7 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.