Health Tips: మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా బ్రష్ చేయడం చేస్తుంటాము అయితే చాలామంది రెండు సార్లు చేయకపోయినా ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది.ఇలా బ్రష్ చేయడం వల్ల మన దంతాలు ఎంతో ఆరోగ్యవంతంగానూ నోటి దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంటుందని చెబుతుంటారు అయితే చాలా మంది బ్రష్ చేసిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా దంతక్షయం రాకుండా ఉండడం కోసం మౌత్ వాష్ ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ విధంగా బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ ఉపయోగించేవారు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని దంత నిపుణులు చెబుతున్నారు. బ్రష్ చేసుకున్న వెంటనే మౌత్ వాష్ చేయడం వల్ల దంతాల్లోని జీవ కణజాలం కుళ్లిపోయి దంతక్షయం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఉపయోగించే టూత్ పేస్టులో 1450pp ఫ్లోరైడ్ ఉంటుంది. మీ మౌత్ వాష్‌లో 220pp ఫ్లోరైడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ చేసుకుంటే.. దంతాలపై గల ఫ్లోరైడ్ శాతం తగ్గిపోతుంది.
మౌత్ వాష్ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్న విషయంలో ఎంత వరకు నిజం ఉందో.. బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ చేసుకుంటే అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మౌత్ వాష్ బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఉపయోగించడం మంచిది. భోజనం చేసిన వెంటనే మౌత్ వాష్ చేసుకుంటే.. దంతాల్లో ఇరుక్కు ఆహారపదార్థాలు తొలగిపోతాయి. దీంతో దంతక్షయం సమస్య దరిచేరదు. అలాగే మౌత్ వాష్ చేసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.