Hair care: సాధారణంగా అమ్మాయిలు లేదా అబ్బాయిలు అందంగా కనిపించాలి అంటే జుట్టు ఎంతో ప్రాధాన్యత పోషిస్తుందని చెప్పాలి జుట్టు ఉంటేనే అందం కూడా రెట్టింపు అవుతుంది అందుకే జుట్టును సంరక్షించుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ చాలామందిలో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య చాలా మందిలో అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం వాతావరణం లోని తేమ అధికమవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా ఉంటుంది.
మరి వర్షాకాలంలో ఈ జుట్టు రాలే సమస్యను తగ్గించాలి అంటే ఎలాంటి చిట్కాలను పాటించాలి ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అనే విషయానికి వస్తే…జుట్టు బాగా రాలిపోతూ ఉందంటే సరైన విధంగా పోషణ అందడం లేదని అర్థం చేసుకోండి. జుట్టు బలంగా ఉండాలంటే ఇతర పోషకాలతో పాటు జింక్ చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్‌లో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ కూడా మెండుగా లభ్యమవుతుంది. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలకుండా ఆపుతుంది.
ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడటానికి క్యారెట్లు కూడా ఎంతగానో దోహదం చేస్తాయి.బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది స్కాల్ఫ్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.చిలకడ దుంపల్లో కూడా బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇవి కూడా జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.జుట్టు రాలే సమస్య ఉన్నవారు తమ డైట్‌లో పప్పులు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో జింక్, ఐరన్, ప్రోటీన్, బయోటిన్ వంటివి లభ్యమవుతాయి. వీటితోపాటు స్టాబెర్రీలను కూడా తరచూ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మనం పూర్తిగా బయటపడటమే కాకుండా జుట్టు దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.