Director Krish: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. విడుదలైన తొలి రోజే ఓవర్సీస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరడంతో పాటు, వసూళ్లు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో నిర్మాతలు ఖుషీ అవుతున్నారు.
అయితే ఈ సినిమా ప్రారంభ దశలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో, దర్శక బాధ్యతలు జ్యోతికృష్ణ స్వీకరించారు. ఈ విషయంపై కొంతకాలంగా పలు అనుమానాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా క్రిష్ ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించినట్లు తెలుస్తోంది.
తనకు పవన్ కల్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంగా తెలిపారు. “నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్ మైండెడ్‌ను. భవిష్యత్తులో పవన్ కల్యాణ్‌తో కలిసి మరో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని క్రిష్ పేర్కొన్నారు. త్వరలో ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడతాయని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇక సినిమా రిలీజ్‌కు ముందు కూడా పవన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ క్రిష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సినిమాను పూర్తి చేయడంలో పవన్ కల్యాణ్, నిర్మాత ఏఎం రత్నం గారు ఎంతో కృషి పెట్టారని, సినిమా జర్నీలో వారి పాత్ర అమూల్యమని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ కలెక్షన్ల పరంగా మంచి జోరుతో సాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో తొలి రోజే ఒక మిలియన్ డాలర్ వసూలు చేయడం సినిమా స్థాయిని, పవన్ బ్రాండ్ పవర్‌ను మరోసారి రుజువుచేస్తోంది. వీకెండ్ కలెక్షన్లతో మరింత బోనీ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.