Devotional Tips: సాధారణంగా ఇంట్లో కనుక మరణం సంభవిస్తే ఆ ఇంట్లోని వారు ఏడాది పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని గుళ్ళకు వెళ్లకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏడాది పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి శుభకార్యాలైన చేసుకోవచ్చని చాలామంది చెబుతున్నారు. మరి నిజంగానే ఇంట్లో మరణం సంభవించిన తర్వాత ఏడాది పాటు పూజలు చేయకూడదా శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే మరణం సంభవించుంటుందో ఆ ఇంట్లో 11 రోజులపాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను కానీ దీపం కానీ వెలిగించకూడదు. అయితే 11వ దినం పూర్తయిన తర్వాత 12వ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఆ రోజు నుంచి యధావిధిగా ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలను చేయవచ్చని పండితులు చెబుతున్నారు. దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. అందుకే మరణం సంభవించిన ఇంట్లో కూడా 11 రోజుల తర్వాత దీపం వెలిగించుకోవడం శుభమని పండితులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఏడాది పాటు దీపం చేయకూడదని పూజ సామాగ్రిని దేవుడి ఫోటోలను కూడా భద్రంగా దాచి పెట్టి ఉంటారు అలా చేయడం మంచిది కాదు.ఇలా ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు గుడికి కూడా వెళ్ళవచ్చు కానీ హోమం యాగం వంటి వాటిని చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశం చేయటం కొత్త కారు ,భూమి వంటి వాటిని కొనుగోలు చేయకూడదు అలాగే పెళ్లి వంటి శుభకార్యాలను కూడా చేయకూడదనీ పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.