Devotional Tips: సాధారణంగా మన హిందూ సంప్రదాయాలు ప్రకారం మనం దేవుడికి చీరలు పట్టు వస్త్రాలు సమర్పించడం చూస్తుంటాము. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరలను ఒకానొక సమయంలో దేవస్థానం వేలం వేస్తారు. ఈ వేలం పాటలో చాలామంది మహిళలు ఆ చీరలను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా కొనుగోలు చేసిన చీరలను తరచూ మహిళలు కట్టుకోవచ్చా? లేదా కట్టుకున్నప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి ? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. మరి ఈ చీరలను కట్టుకొని ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే…
అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం పాటలో కొనుగోలు చేసిన తర్వాత మహిళలు ఆ చీరలను కట్టుకోవచ్చు. అయితే తరచూ ఆ చీరలను మాత్రం కట్టుకోకూడదు ఏదైనా పూజ చేసే సమయంలోను లేకపోతే గుడికి వెళ్లే సమయంలో మాత్రమే ఆ చీరలను కట్టుకోవాలి. అదేవిధంగా ఆ పూజ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వెంటనే వాటిని తీసి మరొక చీరను కట్టుకోవాలి కానీ అదే చీరలోనే ఉండకూడదు. ఇకపోతే చాలా మంది ఆ చీరను కట్టుకొని పడకగదికి కూడా వెళుతుంటారు.
ఈ విధంగా పడకగదికి అమ్మవారి వస్త్రాలను కట్టుకొని ఎప్పుడు వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. అమ్మవారి నుంచి వేలంపాటలో కొనుగోలు చేసినటువంటి వస్త్రాలను కేవలం పూజా సమయంలో మాత్రమే ధరించడం ఎంతో శుభకరం. అంతేకానీ మనం నిత్య పనులు చేస్తున్న సమయంలో ఈ చీరలను కట్టుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పడకగదికి వెళ్లే ముందు చీరను తప్పనిసరిగా మార్చుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దేవుడు వద్ద తీసుకున్నటువంటి పుష్పాలను కూడా పెట్టుకుని పడకగదికి ఎప్పుడు వెళ్ళకూడదనీ పండితులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.