Cotton Buds: సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన చెవిలో ఏర్పడే గులిమిని తీసుకోవడానికి చాలామంది వివిధ రకాల వస్తువులను ఉపయోగిస్తారు. కొంతమంది సేఫ్టీ పిన్ ఉపయోగించగా మరికొందరు హెయిర్ పిన్ ఉపయోగిస్తుంటారు. అలాగే మరికొందరు కాటన్ బడ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా వివిధ రకాల వస్తువులను ఉపయోగించటం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ విధంగా చెవులను శుభ్రం చేయడానికి మనం కాటన్ బడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
కాటన్ బడ్స్ ఉపయోగించడం వల్ల మన చెవిలో పేరుకుపోయినటువంటి గులిమి మరింత లోపలికి వెళ్ళిపోతుంది.ఇలా వెళ్లిపోయినప్పుడు ఈ ప్రభావం కర్ణభేరిపై పడి వినికిడి లోపం తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా ఈ కాటన్ బడ్స్ ఉపయోగించకూడదు.మరి కొన్నిసార్లు మనం వీటి సహాయంతో చెవులను శుభ్రం చేసుకునే సమయంలో కాటన్ లోపలే ఉండిపోతుంది
ఇలా కాటన్ లోపలే ఉండిపోవటం వల్ల మనం స్నానం చేసే సమయంలో ఆ తేమను పీల్చుకొని పెద్ద ఎత్తున చెవిలో ఇన్ఫెక్షన్ ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా ఇన్ఫెక్షన్ కారణంగా చెవి మొత్తం డామేజ్ అవ్వడమే కాకుండా వినికిడి లోపం కూడా తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు వీటి సహాయంతో చెవులను శుభ్రం చేసుకునే సమయంలో కర్ణభేరిపై అధిక ఒత్తిడి తగలడం వల్ల చెవి నొప్పి వచ్చే సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే చెవిలో ఎప్పుడు కూడా ఇతర వస్తువులను పెట్టి శుభ్రం చేయకూడదని నిపుణులు చెబుున్నారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.