Soy Beans: అత్యధిక ప్రోటీన్స్ కలిగిన సోయాబీన్స్ ను ఆహారంగా తీసుకునే విషయంలో చాలా సందేహాలు అపోహలు ఉన్నాయి. సోయాబీన్స్ ను అధికంగా తింటే థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామంది చెబుతుంటారు. మరికొందరు సోయాబీన్స్ ను ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని చెబుతుంటారు. ఇందులో ఏది? అసలు సోయాబీన్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టాలు లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోయాబీన్స్ లో పాలు, గుడ్లు,మాంసాహారంలో కంటే అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభ్యమవుతాయి.సోయా ఆహారం గర్భిణీ స్త్రీలకు మంచిది. వీటిలో అధికంగా బి కాంప్లెక్స్ విటమిన్స్, పోలిక్ యాసిడ్ ఉండడం వల్ల బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది.సోయాలో అధికమొత్తంలో ప్రోటీన్లు, కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు మన శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల, ఆస్తియోఫోరోసిస్ సమస్యను తగ్గిస్తుంది.రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సోయాబీన్స్ లో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్, పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ లోపాలను తొలగించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే తీసుకుంటే ప్రమాదమేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సోయాతో చేసిన వంటకాలు మెనోపాజ్ లక్షణాలను నెమ్మది చేస్తాయి. అలాగే వీటిలో ఐసోఫ్లేవోన్స్‌లో ఈస్ట్రోజెన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.ముఖ్యంగా రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటున్నప్పుడు, సోయా శరీరంలోని థైరాయిడ్ హార్మోన్‌ను గ్రహించడంలో ఆటంకం కలిగించవచ్చు అందుకే సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.