Categories: LatestNewsPolitics

Chandrababu: స్పీడ్ పెంచిన చంద్రబాబు… 75 స్థానాలకి అభ్యర్ధులు ఫిక్స్

Chandrababu: వచ్చే ఎన్నికలలో ఎలా అయిన అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ దిశగా తన వ్యూహాలని పదును పెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. తనయుడు నారా లోకేష్ కి కూడా కీలక బాద్యతలు అప్పగించిన చంద్రబాబు ఓ వైపు రాయలసీమలో పాదయాత్రతో నియోజకవర్గాల వారీగా బలాబలాలని బెరేజు వేసుకుంటున్నారు. అభ్యర్ధులని ప్రకటించే బాధ్యతని లోకేష్ కి అప్పగించారు. మరో వైపు రీజనల్ సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ని ఉత్సాహపరుస్తూ వెళ్తున్నారు. ఇదే సమయంలో సుమారు 75 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్ధులను ప్రకటించేశారు. ఎన్నికలకి ఏడాది ముందే ఇలా అభ్యర్ధులని ఖరారు చేయడం పార్టీకి సానుకూలంగా మారనున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

నేతలపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని అన్నీ సర్వే రిపోర్టులను చూసుకుని అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రాబిన్ శర్మ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నారు. ఆ టీమ్ మొత్తం టీడీపీ నాయకుల బలాలని పరిశీలిస్తోంది.  ప్రకటించిన అభ్యర్ధులను మార్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.  అయితే జనసేనతో పొత్తు ఖాయమైతే కొన్ని స్థానాలకి అభ్యర్ధులని మార్చొచ్చు అని భావిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందనే విధంగానే వారికి బలం ఉన్న స్థానాలని విడిచి పెట్టి చంద్రబాబు ప్రస్తుతానికి అభ్యర్ధులని ఖరారు చేస్తున్నారు.

అయితే పొత్తులపై తమ్ముళ్ళ అభిప్రాయాలని పరిగణంలోకి తీసుకొని వెళ్ళాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. కొంత మంది తెలుగుదేశం నాయకులు జనసేనతో పొత్తు లేకపోయిన ఎన్నికలలో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం పొత్తుతోనే వెళ్లాలని భావిస్తోంది. అవసరం అయితే బీజేపీని కూడా దగ్గర చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే జనసేనాని నిర్ణయంపై స్పష్టత లేకపోవడంతోనే తన పంథాలో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు అనే మాట వినిపిస్తోంది.

Varalakshmi

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.