Dragon Fruit: గత కొన్ని సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేది కాదు కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మార్కెట్లో మనకు విరివిగా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ లభిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో ఖరీదైన ఈ పండ్లు ఇప్పుడు మార్కెట్లో సరసమైన ధరలకు లభిస్తున్నాయి దీంతో ఈ పండ్లను తినేవారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. ఇకపోతే చాలామంది ఈ పండ్లు తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఇలా డ్రాగన్ ఫ్రూట్ కనుక తినకుండా వదిలేసినట్లయితే మనం ఎన్నో ప్రయోజనాలను కోల్పోయినట్లేనని తెలుస్తోంది.
డ్రాగన్ ఫ్రూట్స్ తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు మరి డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి రోజు కనీసం 400 గ్రాముల పండ్లను తినాలి.ఐరన్, జింక్, మాంసకృత్తులు, పాస్ఫరస్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎంతో పుష్కలంగా లభిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో కూడా వెల్లడైంది. ఫంక్షనల్ అండ్ ఫుడ్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో ఉన్నటువంటి పిటయా అనే పోషక పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు దేహానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి తొలగిస్తాయి.డ్రాగన్ ఫ్రూట్ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇందులోని మెగ్నీషియం హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక ఇందులో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా కాపాడుతుంది. ఇక ఫైబర్ పుష్కలంగా ఉండడంతో బరువు తగ్గడానికి కూడా ఫైబర్ ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.