Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ననమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకున్నప్పటికీ, అందం, అభినయంతో మాత్రం ప్రేక్షకులను, మేకర్స్‌ను ఆకట్టుకుంది. దీంతో, కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమాలో మిడిల్ ఏజ్ క్యారెక్టర్ చేసింది.

ఈ సినిమా హిట్ సాధించింది. ఇక, అందరి చూపు ఆషికా మీదే పడింది. వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘నా సామిరంగ’ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా తర్వాత కమిటైన భర్త మహశయులకు విజ్ఞప్తి సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ఆషికా, బికినీ అందాలతో అదరగొట్టింది. అల్ట్రా మోడ్రన్ రోల్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆషిక రంగనాథ్ సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందని టాక్ వినిపిస్తోంది.

ashika-ranganath-most-wanted-heroines-list

Ashika Ranganath: శర్వానంద్ జోడీగా ఆషికా రంగనాథ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఆషికా రంగనాథ్‌లో ప్లస్ పాయింట్ మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు ఇటు సీనియర్ హీరోలకి, అటు యంగ్ హీరోలకి సరిపోయే అందం, పర్సనాలిటీ ఉన్న భామ. అందుకే.. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అవకాశాలను అందుకుంటోంది. ‘గత వైభగం’ లాంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలను ఒప్పుకొని తన సత్తాను చాటుతోంది. ఈ సంక్రాంతికి మస్ మహారాజ రవితేజ సరసన నటించిన ‘భర్త మహాశయులకువిజ్ఞప్తి’ సినిమా ఆషికా రంగనాథ్‌కి మంచి పేరే తెచ్చింది.

శర్వానంద్‌కి జంటగా ఆషికా?

యంగ్ హీరో శర్వానంద్ ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో వచ్చి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం, ‘బైకర్’..’భోగి’ చిత్రాలను చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు. త్వరలో, ఈ మూవీ సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా ఆషికా రంగనాథ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో శర్వానంద్‌పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఇక, ఈ మూవీలో శర్వా మేకోవర్ చాలా కొత్తగా ఉంటుందట. కాగా, ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ను ఫైనల్ చేసినట్టుగా అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.