AR Rehaman: టాలీవుడ్ లో రెహమాన్ డిజాస్టర్ రికార్డ్… చెర్రి బ్రేక్ వేస్తాడా?

AR Rehaman: ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. అతని కెరియర్ ఇంగ్లీష్, హిందీ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా విశేషమైన కీర్తి సొంతం చేసుకున్న రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అయితే ఆయన అసిస్టెంట్ గా కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం టాలీవుడ్ సంగీత దర్శకులు అయిన కోటి, కీరవాణి దగ్గర కావడం విశేషం.  రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకి ఆయన కీబోర్డు ప్లేయర్ గా పనిచేశారు. తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాయు.

అయితే కెరియర్ ఆరంభంలో వెంకటేష్ తో సూపర్ పోలీస్ అనే సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందించారు. అది డిజాస్టర్ అయ్యింది. అలాగే రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్ సినిమాకి సంగీతం అందించారు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. తరువాత దశాబ్దకాలం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నాని సినిమాకి సంగీతం అందించారు. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాకి రెహమాన్ సంగీతం అందించారు. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

అయితే తెలుగులో రెహమాన్ నుంచి వచ్చిన ఒకే ఒక హిట్ మూవీ ఏ మాయ చేసావే. నాగచైతన్య రెండో సినిమాగా ఆ మూవీ రావడం విశేషం. స్టార్ హీరోలకి మాత్రం రెహమాన్ డిజాస్టర్స్ ని ఇచ్చారు. అయితే చాలా కాలం తర్వాత మరల రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ విషయం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత రెహమాన్ మరల రామ్ చరణ్ మూవీకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. అయితే టాలీవుడ్ లో డిజాస్టర్ రికార్డులకి ఈ రామ్ చరణ్ మూవీ అయిన బ్రేక్ ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.