AP POLITICS: ఇటీవల ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారమే రేపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ అయినప్పుడు.. జగన్ అరెస్ట్ అంశం వారి మధ్య ప్రస్తావనకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ అంతర్గత చర్చల గురించిన లీకులు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి.
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అరెస్ట్ అయితే వ్యక్తిగతంగా తనకు వచ్చే లాభం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎదుటివారి పతనాన్ని చూసి ఆనందించే లేదా ఎవరి అరెస్ట్ ద్వారానో లబ్ధి పొందే చౌకబారు రాజకీయాలు తాను ఎప్పుడూ చేయబోనని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాల గురించే చర్చించామని, అమిత్ షా వద్ద జగన్ అరెస్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు అస్సలు లేదని తేల్చి చెప్పారు.
రాజకీయాల్లో తన ఎదుగుదలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. “ఎవరో జైలుకు వెళ్తేనే నేను రాజకీయంగా ఎదుగుతానా?” అంటూ పవన్ వేసిన ప్రశ్న ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేస్తోంది. సొంత బలం, ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి వచ్చానని.. ఎవరో లోపలికి వెళ్తే పండగ చేసుకునే మనస్తత్వం తనది కాదంటూ పవన్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.