Anushka shetty: బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయిన అందాల భామ అనుష్క శెట్టి. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన ఈ అందాల భామ స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. సుదీర్ఘ కాలం హీరోయిన్ గా టాలీవుడ్ లో తన నట ప్రస్థానం కొనసాగించిన దేవసేన అనుష్క బాహుబలి తర్వాత నిశ్శబ్దం అనే సినిమాలో చివరిగా నటించింది.ఆ మూవీ తర్వాత రెండేళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఆమె ఎలా ఉంటుందో అనే విషయం ఆమె అభిమానులకి గాని సగటు ప్రేక్షకులకి గాని తెలియరాలేదు. కనీసం మీడియా కంటికి కూడా అనుష్క శెట్టి చిక్కకుండా ఉంటుంది.
అయితే ఆమె ఇంట్లో ఉండటంతో పాటు తల్లిదండ్రులు పెళ్లిపనులు చూస్తున్నారనే ప్రచారం వినిపించింది. త్వరలో పెళ్లి చేయడానికి రెడీ అవుతున్నారు అనే టాక్ నడిచింది. అయితే ఆమె నవీన్ పోలిశెట్టికి జోడీగా మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇందులో తనకంటే పెద్ద వయస్సు ఉన్న అమ్మాయిని ప్రేమించే యువకుడిగా నవీన్ పోలిశెట్టి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మహేష్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే తాజాగా బెంగుళూరులో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలలో అనుష్క శెట్టి పాల్గొంది. అక్కడ ఆమె కెమెరాకి చిక్కింది. ఈ ఫోటోలలో అనుష్క చాలా బొద్దుగా కనిపిస్తుంది. దీనిని బట్టి అమ్మడు ఎలాంటి వర్క్ అవుట్స్ చేయడం లేదనే మాట వినిపిస్తుంది. ఆమె కంటే ముందు వచ్చిన నయనతార స్లిమ్ అయ్యి స్టార్ట్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఉంటే అనుష్క పూర్తిగా వాటిని పక్కన పెట్టడం ఆసక్తికరంగా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.