AP Politics: ఏపీ రాజకీయాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు అందరూ కూడా బయటకి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే మాత్రం మెజారిటీ స్థానాలలో ఆ కూటమి విజయం సాధిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఎన్ని వ్యూహాలు వేసిన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది కష్టం అనే మాట బలంగా వినిపిస్తుంది. గత ఎన్నికలకి ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన నేతలు కూడా మళ్ళీ సొంతగూటికి వలస రావడానికి సిద్ధం అవుతున్నారనే మాట వినిపిస్తుంది.
అయితే వారికి చంద్రబాబు ఈ సారిగా మాత్రం అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఈ సారి బలమైన అభ్యర్థులని, అలాగే స్థిరగా పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో అసమ్మతి నేతలు బయటపడకపోయిన కూడా 60 మంది వరకు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారందరూ కూడా వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు బోగట్టా.
ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికారంలో తాము కూడా భాగస్వామ్యం అయ్యిఉండాలని భావించే జంపింగ్ నేతలు అందరూ కూడా జనసేన వారాహి యాత్ర తర్వాత ఆ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వేచి చూసి వైసీపీకి దెబ్బ కొట్టాలని ప్రయత్నం. చేస్తున్నారు. దీనికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి ఆ జంపింగ్ నాయకులని ముఖ్యమంత్రి జగన్ గుర్తించారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ఈ ఏడాదిలో ఏపీ రాజకీయాలలో చాలా కీలక మార్పులు మాత్రం కచ్చితంగా చూడొచ్చు అనే మాట బలంగా వినిపిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.