Suhana Khan : షారుఖ్ ఖాన్ కూతురు ఎంత తెలివైనదో..చిన్న వయసులోనే అంత పెద్ద పని చేసింది

Suhana Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ అలీబాగ్‌లో రూ. 12.91 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ మీడియా చానెల్స్ ఈ విషయాన్నీ నివేదించాయి. నివేదిక ప్రకారం, సుహానా ఖాన్ రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్‌లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిని రూ. 12.91 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం.

suhana-khan-daughter-suhana-khan-bought-agricultural-land-of-rs-12-crores

IndexTap.com లోని విక్రయ పత్రం యొక్క ఒప్పందం ప్రకారం, మూడు వరుస గృహాలు కలిగిన ఈ ల్యాండ్ 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో కొబ్బరి చెట్లు, ఇతర తోటలు, బావి, మరియు నీటి ట్యాంకులు ఉన్నట్లు సమాచారం. కఫ్ తన ముగ్గురు సోదరీమణులు అంజలి ఖోటే, ప్రియా ఖోటే, రేఖా ఖోటే నుండి స్టాంప్ డ్యూటీ కింద రూ. 77.46 లక్షలు చెల్లించి, ఈ నెల ప్రారంభంలో తన పేరుమీద రిజిస్టర్ చేసుకుంది. విలాసవంతమైన ఆస్తి కోసం ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తారా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.

suhana-khan-daughter-suhana-khan-bought-agricultural-land-of-rs-12-crores

సుహానా ఖాన్ చేసిన ఈ కొనుగోలుతో, అలీబాగ్‌లో ఖాన్ కుటుంబానికి ఉన్న ఆస్తికి అదనంగా చేరింది . ఇప్పటికే, షారుఖ్ ఖాన్ సమీపంలో విలాసవంతమైన డెజా వు ఫామ్స్ ఉన్నాయి. ఖాన్ కుటుంబ సభ్యులకే కాదు బాలీవుడ్ లోని చాలామంది సెలబ్రిటీలకు అలీబాగ్ సమీపంలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనే-రణవీర్ సింగ్, రాహుల్ ఖన్నా, అనితా ష్రాఫ్ అదాజానియా – హోమీ అదాజానియా, గౌతమ్ సింఘానియా, రామ్ కపూర్ లకు ఎన్నో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

suhana-khan-daughter-suhana-khan-bought-agricultural-land-of-rs-12-crores

సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ఇంటీరియర్ డెకరేటర్ గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ న్యూయార్క్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసింది. అంతకు ముందు ఆమె ఆర్డింగ్లీ కాలేజీలో సినిమా కోర్స్ ను అభ్యసించింది. గతంలో థియేటర్ షోలు కూడా చేసిన సుహానా ఖాన్, థియోడర్ గిమెనో దర్శకత్వం వహించిన ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. జోయా అక్తర్ యొక్క ది ఆర్చీస్ తో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి, చిత్ర నిర్మాత బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద కూడా నటించాడు.

Sri Aruna Sri

Recent Posts

Liver Health: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా? మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే?

Liver Health: మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనే విషయాలను మన శరీర లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు. మన…

17 hours ago

Tirumala: తిరుమల వెళ్లే భక్తులు అలర్ట్..40 రోజుల పాటు భక్తులకు నో ఎంట్రీ..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి అధికారులు కీలక సూచనలను జారీ చేశారు. మరి కొద్ది రోజులలో శ్రీవారి వార్షిక…

17 hours ago

Drinking water: అన్నం తింటూ నీళ్లు తాగుతున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే?

Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8…

2 days ago

Tholi Ekadashi 2026: తొలి ఏకాదశి.. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే జన్మజన్మల పాపాలు పోయినట్టే?

Tholi Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే…

2 days ago

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

4 days ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

5 days ago

This website uses cookies.