Categories: EntertainmentLatest

Pushpa 2 : అల్లు అర్జున్‎తో యానిమల్ బ్యూటీ

Pushpa 2 : ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన మూవీ పుష్ప. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ఈ సినిమా విడుదలకు ముందే పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. శ్రీవల్లీ, నా సామి, వంటి పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ అనే సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. స్టౌత్ స్టార్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. ‘పుష్ప’మూవీ విజయంలో ఈ పాట కూడా కీలకంగా నిలుస్తుంది. అప్పట్లో ఈ సాంగ్ కు ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది.

pushpa-2-animal-actress-triptii-dimri-to-perform-special-song

పుష్పకు వచ్చిన రెస్పాన్స్ తో అంతకు మించిన స్టోరీతో సుకుమార్ పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన పుష్ప రాజ్ సాంగ్ ప్రోమో ఇరగదీస్తోంది. రెండు మూడు రోజుల్లో రష్మిక సాంగ్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వచ్చింది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ పాట కోసం ఇప్పటికే మేకర్స్ చాలా మంది హీరోయిన్స్ పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. యానిమల్ మూవీలో కుర్రాళ్ల మనసులను దోచేసిన తృప్తి పుష్ప2 స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

pushpa-2-animal-actress-triptii-dimri-to-perform-special-song

యానిమల్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ తృప్తికి దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాడు. ఈ సినిమా హిట్ తో బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప 2 ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో త్రిప్తి , అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప2 లో ప్రత్యేక గీతానికి ఓ రేంజ్ క్రేజ్ ఉంది. బన్నీ, త్రిప్తి జోడిగా ఈ సాంగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. బన్నీ సూపర్ డ్యాన్సర్.. ఇక త్రిప్తి గ్లామర్ రెండూ కలిస్తూ సాంగ్ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. మరి వీరిద్దరి జోడీ ఫిక్స్ అయ్యిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

AP POLITICS: జగన్ హెచ్చ‌రిక‌.. ఏపీలో ‘కాక్రోచ్’ పాలిటిక్స్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…

23 hours ago

Politics: నాపై ఏ కేసు లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్!

Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…

1 day ago

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

1 day ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

1 day ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

2 days ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

2 days ago

This website uses cookies.