Family: ఆ ఒక్క మాట చాలు… అందరూ దూరం అయిపోవడానికి

Family: సమాజంలో కుటుంబ వ్యవస్థ అనే పునాదుల మీద నిలబడి నడుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఆ కుటుంబాల కారణంగానే బంధాలు, అనుబంధాలు మనుషుల మధ్య ఉన్నాయి. ప్రేమ, ఆప్యాయత, నలుగురితో కలిసి బ్రతికే తత్త్వం ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇండియాలో బలంగా ఉండేది. ప్రాచీన నాగరిక ప్రపంచంలో చాలా దేశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే జీవనం సాగించాయి. అయితే మారుతున్న కాలంతో పాటు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పూర్తిగా కనుమరుగు అయిపోయాయి. ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా కుల వృత్తులు, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతకడం వలన అందరూ కలిసి పనిచేసుకొని వచ్చిన దాంతో సంతోషంగా బ్రతికేవారు.

అయితే ఎప్పుడైతే భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే వ్యవసాయాన్ని వదిలేసి బ్రతకడం కోసం ఇతర వృత్తులలోకి వెళ్ళడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మెల్లగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవుతూ వస్తున్నాయి. ఉద్యోగాల వేటలో, బ్రతుకు కోసం ఆడే ఆటలో సొంత ఊరిని, కన్నవాళ్ళని వదిలేసి దూర ప్రాంతాలకి వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అక్కడి నుంచి కుటుంబంలో ఉన్న బంధాలు, బంధువుల మధ్య అంతరం పెరగడం మొదలైంది. కలిసి ఉండాలంటే వంద కారణాలు కావాలి. దూరంగా ఉండటానికి, బంధాలని వదులుకోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు.

ఒక్క మాట చాలు. ఆ మాట మొత్తం ఆలోచనలని మార్చేస్తుంది. ఒకరికి ఒకరిని వదులుకునే వరకు తీసుకెళ్తుంది. ఆ మాట కుటుంబంలో అంతరాలు పెంచేస్తుంది. సొంత వాళ్ళని కూడా ద్వేషించే స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఏ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఈ ప్రపంచంలో ఒకే విధంగా ఉండవు. అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్న సమయంలో ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా అందరూ కుటుంబంలో పెద్దగా ఉన్న తల్లిదండ్రుల మాటకి ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు తీసుకున్న నిర్ణయాలని గౌరవించే వారు. అయితే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ విచ్చిన్నం అయిన తర్వాత ఎవరికి వారు సొంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం తమ నిర్ణయాలలో భార్య, భర్తలు మాత్రమే ఉంటారు. వారిద్దరూ నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎంతగా గొడవ పడిన ఫైనల్ గా బయటకి వచ్చేటపుడు ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఒకే ఆలోచనతో వస్తారు.

ఇంత వరకు భాగానే ఉంటుంది. కాని వారు తీసుకున్న నిర్ణయాలలో తన కుటుంబంలో, ఆ కుటుంబం బంధంలో ఉన్న అందరూ ఉండరు కాబట్టి వారికి ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటారు. వారి ఇష్టానికి లోబడే మాట్లాడుతారు. అయితే కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలు కుటుంబంలో మిగిలిన వారికి నచ్చకపోవచ్చు. ఎవరికి వారు తమకి ఉపయోగం ఏంటి అనే కోణంలోనే ఆలోచించడం వలన ఒక్కోసారి ఆశలు తీరవు. అప్పుడే అభిప్రాయ బేధాలు మొదలవుతాయి. విభేదించడం మొదలు పెట్టి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడుతారు. ప్రతి ఒక్కరికి ప్రస్తుత సమాజంలో ఇగో అనేది ఉంటుంది.

అ ఇగో ఒకప్పుడు నా వాళ్ళు అంటూ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముల్లు అందరూ ఉండేవారు. అయితే ఆ ఇగోలో కేవలం నా వాళ్ళు అంటే నేను, నా భార్య, నా పిల్లలు అనేది మాత్రమే ఉంటుంది. ఇక్కడే ఇగోలు హార్ట్ అయినపుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునే వరకు వెళ్ళిపోతారు. ఆ ఇగో హార్ట్ అవడానికి ఒక్క మాట చాలు. అందుకే అంటారు పదిమందిలో మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలి. నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా. నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా. నేను చాలా ఫ్రాంక్ గా ఉంటా. ముక్కుసూటిగా మాట్లాడుతా అనే మాటలు చాలా మంది నోటి నుంచి వినబడతాయి.

కాని ఉమ్మడి కుటుంబాలలో బంధాలు నిలబడ్డాయి అన్నా, గ్రామాలలో ఒకరికి ఒకరు అన్నట్లు అందరూ కలిసిమెలిసి పండగలు, శుభకార్యాలు చేసుకునే వారన్నా కేవలం లౌక్యంగా మాట్లాడి. నొప్పించక, తానొవ్వక అన్నట్లు మాట్లాడటమే. అలాగే అందరి వ్యక్తిగత అభిప్రాయాలకి గౌరవం ఇవ్వడమే. అలాగే ఒకరు ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఉన్నవారు ఉన్న కూడా వారు ఆడే మాటకి ఇగోకి పోకుండా ఆలోచించి అర్ధం చేసుకునే అలవాటు ఉండటమే. అయితే ఈ రోజుల్లో ఎదుటివారు అన్న మాట కాస్తా కఠినంగా ఉండే తీసుకునే తత్త్వం కాని, ఆలోచించే మనస్తత్వం కాని ఎవరికి లేవు.

నువ్వు ఒక మాట అంటే నేను పది మాటలు అంటా అనే విధంగానే అందరూ ఉన్నారు. ఈ కారణంగా బంధాలు విచ్చిన్నం అవుతూ ఉన్నాయి. కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. అపార్ధాలతో దూరం అయిపోతున్నారు. ఆవేశాలకి పోయి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ ఆగాలన్నా, మారలన్నా ఒక్కటే పరిష్కారం. ఆ ఒక్క మాటని ఆలోచించి మాట్లాడితే చాలు. ఆ ఒక్క మాటని ఆవేశ పడి అనకుండా ఉంటే చాలు. ఆ ఒక్క మాటకి ఇగో హార్ట్ చేసుకోవడం మానేస్తే చాలు. ఆ ఒక్క మాటని క్షమించేస్తే చాలు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 week ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.