NBK 112: బాలయ్య నందమూరి తమన్ ని పక్కన పెడతాడా?

NBK 112: బాలయ్య తమన్ ని పక్కన పెడతాడా? ప్రస్తుతం అటు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇటు బాలయ్య అభిమానుల్లో..సోషల్ మీడియాలో ఇదే టాపిక్ ఆసక్తికరంగా సాగుతోంది. దీనికి కారణం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయో తన 112వ సినిమాకి సంగీత దర్శకుడిగా తమిళ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు చర్చలలో ఉండటమే. ముఖ్యంగా, దర్శకుడు కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు ప్రముఖ రచయిత కొరటాల శివ. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాలకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ పనిచేశాడు. సూపర్ హిట్ సాంగ్స్, అదిరిపోయో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ సినిమాల సక్సెస్‌లో డీఎస్పి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతమందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, మ్యూజికల్‌గా ఈ సినిమా ఓకే.

nbk-112-will-balayya-leave-nandamuri-thaman-aside

NBK 112: కొరటాల మార్క్ అంశాలతో పాటు బాలయ్య మార్క్ పవర్ స్టోరీ

ఇక, ఎన్‌టీర్ డ్యూయల్ రోల్ లో నటించిన దేవర సినిమాకి కొరటాల శివ తమిళ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ ని ఎంచుకున్నాడు. ఈ మూవీ సాంగ్స్, బీజిఎం హైలెట్‌గా నిలిచాయి. కొన్ని తప్పిదాల వల్ల సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దాంతో, కొరటాల దేవర పార్ట్ 2ని మరింత పకడ్బంధీగా తయారు చేశాడు. కానీ, ఎన్‌టీర్ చేస్తున్న డ్రాగన్ సినిమా ఆలస్యం కావడంతో..కొరటాలకి గ్యాప్ వచ్చింది. దాంతో, ఈ గ్యాప్‌ను బాలయ్యతో ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలయ్యతో ఓ పవర్ ఫుల్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు.

ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కొరటాల మార్క్ అంశాలతో పాటు బాలయ్య మార్క్ పవర్ స్టోరీ, డైలాగ్స్ ఉండబోతున్నాయని అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో ఓ క్లారిటీ వచ్చింది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న సినిమాల తరహాలోనే కొరటాల శివ..గాడ్ ఆఫ్ మాసెస్‌ను చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందులో, భాగంగానే..సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలయ్య బ్లాక్ బస్టర్స్ అన్నిటికీ థమన్ సంగీతం అందించాడు. బాలయ్య కొట్టిన సక్సెస్‌లలో థమన్‌దే కీలక పాత్ర. కాస్ట్లీ కార్ గిఫ్ట్ కూడా ఇచ్చిన బాలయ్య ..నందమూరి థమన్ అని కూడా చెప్పాడు. మరి, ఆ సెంటిమెంట్‌ను కొరటాల బ్రేక్ చేస్తాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.