Mrunal Thakur: “ఎల్లమ్మ” గా సూటవుతుందా? దిల్ రాజు రాంగ్ స్టెప్!

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఎల్లమ్మ గా సూటవుతుందా? దిల్ రాజు రాంగ్ స్టెప్ వేస్తున్నాడా? ప్రస్తుతం దీనికి సంబందించిన చర్చలే ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్నాయట. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. నిర్మాతలలో, డిస్ట్రిబ్యూటర్స్‌లో దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. అలాంటి దిల్ రాజు, ఈ మధ్యకాలంలో సినిమాల నిర్మాణంలో కాస్త స్లో అయ్యాడు. వరుస ఫ్లాపులతో భారీ నష్టాలను చూశాడు. అందుకే, ఇప్పుడు ఒక్కో సినిమాను చాలా నెమ్మదిగా పట్టాలెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం, తెలుగులో ఎల్లమ్మ సినిమా నిర్మాణంలో ఉంది. అలాగే, హిందీలో సల్మాన్ ఖాన్-నయనతార కాంబినేషన్‌లో ఓ సినిమాను మొదలుపెట్టాడు. దీనికి దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ మూవీ సక్సెస్ అటు నిర్మాతగా దిల్ రాజుకి, హీరోగా సల్మాన్ కి, దర్శకుడుగా వంశీపైడిపల్లి కి చాలా కీలకం. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుందని సమాచారం. అయితే, దిల్ రాజు హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తే హిట్ టాక్ వస్తే కాస్త ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కుతాడని అంటున్నారు. అలా, కాకుండా పాన్ ఇండియా సినిమా అని మిగతా సౌత్ భాషలలో కూడా ప్రయోగం చేస్తే ఇబ్బందేనట.

mrunal-thakur-will-it-suit-yellamma-dil-rajus-wrong-step

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ని ఎల్లమ్మ పాత్రలో మన వాళ్ళు ఒప్పుకుంటారా?

ఇక, తెలుగులో చేస్తున్న మరో ప్రయోగం ఎల్లమ్మ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా. నాని, నితిన్ ల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేతికి చేరింది ఈ సినిమా. నేచురల్ లుక్‌లో దర్శకుడు వేణు ఎల్దండి దేవి ని చూపించబోతున్నాడని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. హీరోగా దేవిశ్రీప్రసాద్ కి మొదటి సినిమా. కాబట్టి, ఈ ప్రాజెక్ట్ దిల్ రాజుకి పెద్ద సవాల్ అని చెప్పాలి. ఇక, హీరో మారినట్టుగానే ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ కూడా మారిపోయింది. దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధన, ఎల్లమ్మ సినిమాలలో కీర్తి సురేష్ ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నారు.

కానీ, ఇప్పుడు కీర్తి.. ఒక్క ‘రౌడీ జనార్ధన’ మూవీ మాత్రమే చేస్తోంది. ఎల్లమ్మ నుంచి ఆమె తప్పుకుంది. తర్వాత, సాయి పల్లవి పేరు వినిపించింది. కీర్తి తప్పుకున్నా ఆ స్థానంలో మంచి క్రేజీ హీరోయిన్ వచ్చిందనుకున్నారు. కానీ, సాయి పల్లవి ఒప్పుకోలేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం హీరో దేవిశ్రీప్రసాద్ కావడమేనట. దీంతో, ఇప్పుడు ప్రచారంలో మృణాల్ ఠాకూర్ పేరు చక్కర్లు కొడుతోంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్..ఇటీవల వచ్చిన డెకాయిట్ మూవీస్‌తో బాగానే పాపులర్ అయింది.

అయితే, మృణాల్ కి ఈ మధ్య హిట్ సినిమాలేవి పడలేదు. పైగా, ఈ నార్త్ బ్యూటీని ఎల్లమ్మ పాత్రలో మన వాళ్ళు ఒప్పుకుంటారా? అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎల్లమ్మ రోల్ కి కీర్తి సురేష్, సాయి పల్లవి పర్ఫెక్ట్ ఛాయిస్. కానీ, వాళ్ళిద్దరూ నో చెప్పేశారు. ఈ క్రమలో వచ్చిన మరో పేరు మృణాల్..కానీ..తనని ఊహించుకోవడం ఆ పాత్రలో చాలా కష్టం. మరి, దిల్ రాజుకి ఎల్లమ్మ ఎప్పుడు దొరుకుతుందో..ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ప్రస్తుతం హీరోయిన్ లేకుండా..మిగతా సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. త్వరలో, ఎల్లమ్మ పాత్రకి హీరోయిన్ ఫైనల్ అయితే..దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

12 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

14 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.