Categories: HealthLatestNews

Heart stroke: మీలో ఈ అలవాట్లు ఉన్నాయా? మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్టే?

Heart stroke: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు అధికమవుతున్న సంగతి తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఇలా గుండెపోటు రావడానికి ప్రధాన కారణం మన అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. మన ఆహార శైలి జీవన ప్రమాణాలు గుండె పట్ల తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మన గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలి అంటే మన జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిద్ర లేవగానే ఈ అలవాట్లు కనుక మీలో ఉన్నట్లయితే కచ్చితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటి అనే విషయానికి వస్తే..

చాలామంది ఉదయం నిద్ర లేవగానే మంచం పైనుంచి టక్కున దిగి వారి పనులలో నిమగ్నం అవుతారు. ఇలా చేయడం వల్ల గుండెపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఉదయం నిద్ర లేచిన తర్వాత కాసేపు అలాగే కూర్చుని కాళ్లు చేతులను ఒత్తుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. ఇక చాలామందికి నిద్ర లేవగానే వేడివేడి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయటం వల్ల కాఫీలో ఉండే కెఫిన్ గుండెపోటుకు కారణమవుతుంది.

Morning habits that can harm your heart it causes heart stroke know details

Heart stroke: శారీరక వ్యాయామం ఎంతో ముఖ్యం..

ఇటీవల కాలంలో చాలామంది డైటింగ్ పేరుతో ఉదయం టిఫిన్ చేయడం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ మందగించి అధిక శరీర బరువు పెరగడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె పోటుకు కారణం అవుతుంది. ఒకవేళ డైటింగ్ ఉన్నవారు కోడిగుడ్లు, ఓట్స్, బాదం వంటి వాటిని తీసుకోవటం మంచిది. ఇక చాలామంది నిద్ర లేవడంతోనే తీవ్రమైన ఒత్తిడి కోపంతో నిద్ర లేస్తుంటారు. ఇలా చేయటం వల్ల మన శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా గుండెపోటు రావడానికి కారణమవుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి . ఇక ఇటీవల ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక వ్యాయామానికి దూరమవుతున్నారు. మన శరీరంలో కదలికలు లేకపోతే రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుని గుండెపోటుకు కారణం అవుతుంది అందుకే ఉదయం లేవగానే కొంతసేపు వ్యాయామం చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

 

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

14 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

16 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.