Categories: LatestNews

Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్….గురుకులాల్లో 9231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

Job Notification: ప్రస్తుత కాలంలో ఉద్యోగం కోసం యువతి యువకులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి . తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగస్తులకు శుభవార్త తెలియజేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిటిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI – RB) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12 వ తేదీ నుండి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవలసినదిగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 9231 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. గురుకుల పాఠశాలలో కళాశాలలో ఉన్న ఖాళీల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణా గురుకుల డిగ్రీ కాలేజీలలో 868 లెక్చరర్, లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గురుకుల జూనియర్ కాలేజీలలో 2,008 లెక్చరర్, లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Notification:

అలాగే PGT – 1,276

TGT – 4,020

లైబ్రెరియన్ (స్కూల్) – 434

ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్) – 275

డ్రాయింగ్/ ఆర్ట్ టీచర్లు – 134

క్రాప్ట్ ఇన్‌స్ట్రక్ట్రర్/ టీచర్ – 92

మ్యూజిక్ టీచర్లు – 124

అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 12వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి www.treirb.telangana.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి పూర్తి వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.