సాధారణంగా మనం మాట్లాడే సమయంలో కొందరి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే ఈ దుర్వాసన ఇతరులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు నలుగురులో స్వేచ్ఛగా మాట్లాడాలన్నా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నోటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించుకోవడంలో అశ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో ప్రమాదకర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు నోటిని,దంతాలను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కొంతకాలానికి దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ప్రారంభమై నోటి నుంచి దుర్వాసన వెలవడే అవకాశం ఉంటుంది. ఇలా నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్, జీర్ణ కోశ వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ కనుక నోటి దుర్వాసన విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు.
నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను పొందాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు.చిగుళ్ల ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్న పసుపు, ఉప్పు మిశ్రమం కలిపిన నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలి. నోరు, గొంతు, నాలుక పొడి బారిన నోటి దుర్వాసన వస్తుంది. కనుక ప్రతి రెండు గంటలకు ఒకసారి తప్పనిసరిగా గ్లాసు మంచినీళ్లు తాగడం మంచిది.
కొన్ని జాగ్రత్తలను పాటించడమే కాకుండా మన ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం రోజువారి ఆహారంలో భాగంగా ఎక్కువగా విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే పండ్లు కూరగాయలు కూడా అధికంగా తీసుకోవాలి. ఇక భోజనం చేసిన తర్వాత చిటికెడు సొంపు తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు. మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసి ప్రతిరోజు పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు తొలగి నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర సమయాల్లో నోటి దుర్వాసన పోగొట్టే మెంథాల్ ఔషధ గుణాలు కలిగిన మౌత్ వాష్, చూయింగ్ గమ్ వాడవచ్చు. అలాగే పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం, పొగాకు నమలడం వంటి చెడు అలవాట్లు ఉంటే తక్షణమే మానుకోవాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.