Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా ఒకటి. ఇలా ఆధ్యాత్మిక పరంగా మర్రి చెట్టుకు ఎంతో మంచి విశిష్టత ఉన్న నేపథ్యంలో చాలా మంది మర్రి ఆకులను పూజలో ఉపయోగించవచ్చని భావిస్తూ ఉంటారు. అయితే మర్రి ఆకులు పూజలో ఉపయోగించేవారు కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.మర్రి ఆకులతో అన్ని దేవతలకు పూజ చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ దేవుళ్లకు మర్రి ఆకులతో ఎట్టి పరిస్థితులలో కూడా పూజలు చేయకూడదు.
చాలామంది మర్రి ఆకులతో విష్ణు దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. అలా విష్ణు దేవుడిని పూజించడం మంచిది కాదు .ఎందుకంటే పురాణాల ప్రకారం మర్రి చెట్టు విష్ణు తత్వంతో సంబంధం కలిగి ఉంది. అందుకే ఆయన నివాసమైనటువంటి మర్రి ఆకులతో తిరిగి విష్ణు దేవుడిని పూజించడం మంచిది కాదు అందుకే విష్ణు దేవుడి ఆరాధనలో మర్రి ఆకులను ఉపయోగించకూడదు. ఇక మర్రి చెట్టులో శివతత్వం నిక్షిప్తమై ఉందని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే శివుడికి కూడా మర్రి ఆకులతో పూజ చేయకూడదు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలతో మాత్రమే పూజించాలి అలా పూజ చేయడం వల్ల శివుడి అనుగ్రహం మనకు కలుగుతుంది.
ఇక వినాయకుడి పూజలో కూడా మర్రి ఆకులను ఉపయోగించకూడదు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో పూజించడం మంచిది. ఇక మర్రి ఆకులను లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో శుభప్రదమైనవిగా భావిస్తూ ఉంటారు. మర్రి ఆకులు వైరాగ్యం, త్యాగ భావాలకు సంకేతంగా ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఆరాధనలో ఈ మర్రి ఆకులను ఉపయోగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అదేవిధంగా శనీశ్వరుడి పూజ, హనుమంతుడి అనుగ్రహం కోసం పూజలో మర్రి ఆకులను ఉపయోగించడం మంచిది.వటసావిత్రి వ్రతం, మర్రి వృక్ష పూజలు, కొన్ని ప్రత్యేక శాంతి పరిహారాల్లో కూడా ఈ ఆకులకు ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శని దేవుడి చల్లని చూపులు మనపై ఉండాలి మర్రి ఆకులు సమర్పించి పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.