Tollywood: వెంకటేష్ మహాకి ఇచ్చిపడేసిన హరీష్ శంకర్

Tollywood: కొద్ది రోజుల క్రితం యువ దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ చాప్టర్ 2 మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని ప్రేక్షకులు ఎందుకు హిట్ చేసారో అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. అలాగే అందులో రాఖీ భాయ్ పాత్ర  మలచిన విధానంపైన కూడా ఘాటుగా బూతులతో విమర్శలు చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఇక తన మాట్లాపై వెంకటేష్ మహా వివరణ ఇచ్చుకున్నారు. అయితే అదే ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాలు అంటూ అసలు తల తోక లేకుండా, సీన్ కి సీన్ కి సంబంధం లేకుండా కథలు  తెరకెక్కిస్తున్నారని, బేసిక్ ఎథిక్స్ లేకుండా మోరల్స్ లేకుండా సినిమాలు చేస్తున్నారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. మేము కత్తి పట్టడం మొదలు పెడితే వారికంటే బాబు లాంటి సినిమాలు చేయగలం అంటూ కామెంట్స్ చేశారు.

 

ఈ కామెంట్స్ అయితే వీటిపై అతను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో కమర్షియల్ జోనర్ లో హీరోయిక్  కథలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న స్టార్ దర్శకులలో హరీష్ శంకర్ కి వెంకటేష్ మహా వ్యాఖ్యల మీద కోపం వచ్చినట్లు ఉంది. ఈ నేపధ్యంలో బలగం సక్సెస్ ఈవెంట్ లో హరీష్ శంకర్ కాస్తా సీరియస్ గా మాట్లాడారు. అసలు సినిమాలలో కమర్షియల్, క్లాసిక్ అనే విభజన ఉండదని, మనకి అర్ధం కావడం కోసం అలాంటి డిఫరెన్స్ పెట్టుకున్నాం అని అన్నాడు. అదే సమయంలో సినిమా ఎలా తీసాం అని అని కాదు ప్రేక్షకుకిడికి అది నచ్చిందా లేదా అనేదే కొలమానం అన్నారు.

ప్రేక్షకులకి నచ్చితే  ఫార్మాట్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసి సక్సెస్ చేస్తారని అన్నారు. సాగర సంగమం సినిమాలో ఏం కమర్షియల్ అంశాలు ఉన్నాయని ప్రేక్షకులు అంతగా ఆదరించారు. అలాగే తాజాగా వచ్చిన బలగం సినిమా చూసిన తర్వాత కమర్షియల్ చిత్రాలు చేసిన దర్శకులు అందరూ కూడా బాగుందని మెచ్చుకున్నారు. ప్రియదర్శి మల్లేశం సినిమా తనకి భాగా నచ్చింది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం లాంటిది .

 

ఒక్కొక్కరు ఒక్కోరకమైన సినిమా చేయొచ్చు అయితే అవి  ప్రేక్షకులకి నచ్చాలని కోరుకోవాలి. ఒక సినిమా పోవాలి, మా సినిమా మాత్రమే ఆడాలి అనే ఆలోచన ఉండకూడదు. అన్ని కమర్షియల్ 300 కోట్లతో తీసిన 3 కోట్లతో తీసిన ప్రజలకి నచ్చేది కమర్షియల్ సినిమా అవుతుంది. దానికి ప్రత్యేకంగా ఎలాంటి హంగులు అవసరం లేదు. అనవసరమైన ఆరోపణలు చేసుకోకుండా ఉండటం సరైన పద్ధతి అంటూ హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.