Categories: Tips

Cheque: మీరు ఎవరికైనా చెక్ ఇస్తున్నారా.. అయితే తప్పనిసరిగా ఇవి పాటించాలి…

Cheque: మనలో చాలామంది కొన్ని విషయాలలో అశ్రద్ధగా ఉంటుంటారు. పని ఒత్తిడుల వల్లనో లేక ఇతర వాటి మీద ధ్యాస పెట్టడం వల్లనో కొన్ని ముఖ్యమైన పనులల్లో అనుకోకుండా పొరపాట్లు చేసి ఆర్థికంగా నష్టపోతుంటారు. సాధారణంగా ఇప్పుడు అంతా ఆన్‌లైన్ ట్రాన్‌సాక్షన్ జరుగుతున్నాయి. ఇది అన్నీ సమయాలలో సేఫ్ కాదనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. గతంలో అయితే కచ్చితంగా బయటకు వెళ్లి సరుకు కొనుకోవాలన్నా.. పండుగులకు బట్టలు కొనాలన్నా..ఇంట్లో ఏదైనా కాస్త ఖరీదైన వస్తువులను కొనాలన్నా బ్యాంకుకు వెళ్లి విత్ డ్రాల్ ఫార్మ్ మీద మనకు కావాల్సినంత అమౌంట్ రాసి మన అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకునేవా ళ్ళము.

అయితే, మారుతున్న కాలానుగుణంగా పెరుగుతున్న టెక్నాలజీ పరంగా ఇంటర్నెట్ సేవలనే ఎక్కువగా పొందడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీసుల్లో పనుల వేళలు బ్యాంక్ వరకు వెళ్ళేందుకు సహకరించడం లేదు. దాంతో ఇంటర్నెట్-మొబైల్ బ్యాంకింగ్ అంటూ చేతిలోనే ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులైన కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ ద్వారా డబ్బును ఇతరులకు పంపడం..మన వారి నుంచి పొందడం చేస్తున్నాము. దాదాపుగా అందరూ ఇదే పద్దతికి అలవాటు పడ్డారు. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉండే ఆకాశాలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే..తెలుసుకోవాల్సిందే.

follow these before giving cheques

ఎప్పుడు కూడా ఇలా ఆన్‌లైన్ ట్రాన్సెక్షన్ అనేసి అంత మంది కాదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చిన్న మొత్తంలో అయితే పరవాలేదు గానీ, పెద్ద మొత్తంలో వేరే వారికి ఇచ్చే డబ్బు విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదు. నేరుగా మనిషిని కలిసి డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక మరీ మౌఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం చెక్కులు ఇచ్చేటప్పుడు కొన్ని తప్పనిసరి పద్దతులను పాటించాల్సి ఉంటుంది.

ఎక్కువగా చెక్కులిచ్చే సమయంలో ఆ చెక్ నంబర్‌ను మనం చెక్ బుక్కులో మొదట ఇచ్చే ఇంఫో కాలంలో నోట్ చేసుకోవాలి. ఎవరికి ఇస్తున్నాము..ఎంత అమౌంట్ ఇస్తున్నాము.. ఎవరి పేరు మీద ఇస్తున్నాము అనే విషయాలను తప్పకుండా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఇది ఎంత మాత్రం మర్చిపో కూడనిదీ ఏమిటంటే చెక్కు మీద రాసే అమౌంట్ కరెక్ట్‌గా వేసి..అదే అమౌంట్ ను అక్షరాల రూపంలో కూడా రాసి చివరిలో ఎండ్ గీత గీయాలి.

అంతేకాదు, చెక్ మీద తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌లో ఏ విధంగా సంతకం చేస్తామో అదే విధంగా సంతకం చేయాలి. ఇక చెక్కు మీద వేసే డేట్ కూడా చాలా ముఖ్యం. పొరపాటున కూడా సంవత్సరాన్ని సగం నంబర్‌తో రాయకూడదు. ఉదా.. 02.02.22 అంటే దీనిని పూర్తిగా 02.02.2022 అని రాయాలి. సగం రాస్తే అవతలి వారు డేట్ మార్చేసే ప్రమాదం ఉంది. ఇక పొరపాటున కూడా చెక్కు మీద అమౌంట్ రాయకుండా సంతకం, డేట్ వేసి బ్లాంక్ చెక్ ఇవ్వకూడదు. లేదంటే గనక మీరు ఇవ్వాల్సిన డబ్బు కంటే ఎక్కువ డబ్బును మీకు తెలియకుండా డ్రా చేసుకునే ప్రమాదం ఉంది.

ఆ తర్వాత లేని పోని ఇబ్బందులు పడుతూ బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. చెక్ మీద పెట్టే సంతకం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మీ సంతకాన్నే ఫోర్జరీ చేసి బ్యాంక్ ఖాతా నుంచి మీ డబ్బు కాజేసే అవకాశం ఉంది. ఇక కొంతమందికి బండి కొన్నప్పుడో లేక ఇతర వస్తువులు..ల్యాండ్ కొన్న సమయంలో మూడు లేదా నాలుగు చెక్కులు షూరిటీగా ఇవ్వాల్సి వస్తుంది.

ఆ సమయంలో కూడా ఎన్ని చెక్కులిస్తున్నారో ఎవరికిస్తున్నారో తప్పనిసరిగా చెక్కు నంబర్లతో సహా నోట్ చేసి పెట్టుకున్న తర్వాతే చెక్కులివ్వాలి. అలాగే, చెక్ వెనకాల కూడా మీ పూర్తి పేరు..సంతకం, మొబైల్ నంబర్ రాసి ఇవ్వాలి. అలాగే, మీ టర్మ్ పూర్తయ్యాక మీరు ఇచ్చిన చెక్కులన్నిటినీ తిరిగి తీసుకోవాలి. లేదంటే అలా ఇచ్చిన చెక్కుల వల్ల కూడా మీ డబ్బు బ్యాంక్ ఖాతా నుంచి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితు ల్లోనూ చెక్కులిచ్చే సమయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

16 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

5 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.