Categories: LatestNewsPolitics

AP Politics: ముందస్తు వ్యూహాలు సిద్ధం అవుతున్నాయా?

AP Politics: ఏపీ రాజకీయాలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. అధికార పార్టీ వైసీపీ బయటకి పూర్తి కాలం అధికారంలో ఉంటామని, ముందస్తుకి వెళ్ళే ఆలోచన లేదని చెబుతున్నారు. అయితే మరో వైపు నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేసుకుంటున్నారు. అలాగే గ్రామ సారథులని సిద్ధం చేస్తున్నారు. మరో వైపు పార్టీ కార్యవర్గంతో భేటీ అవుతూ  ఎన్నికల కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఆయా నియోజకవర్గాలలో తమకి అనుకూలంగా పని చేసే అధికారులని కూడా నియమించే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తుంది.

early-elections-plan-in-ap

మరో వైపు ప్రతిపక్ష టీడీపీ కూడా సైలెంట్ గా తన కార్యాచరణని సిద్ధం చేసుకుంటూ వెళ్తుంది. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే మరో వైపు మరో వైపు చంద్రబాబు నాయుడు పార్టీ కార్యవర్గ సభ్యులతో మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా లేదంటే జోనల్ వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేయాలని భావిస్తున్నారు. 160 నియోజకవర్గాలలో టీడీపీ గెలుస్తుందని క్యాడర్ కి చెబుతున్నారు. అలాగే అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత పూర్తిగా తమకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.

 

ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ క్యాడర్ కి సూచిస్తున్నారు. ఇక జనసేన పార్టీ కూడా ముందస్తు ఎప్పుడు వచ్చిన కూడా తాము సిద్ధం అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్ నుంచి వారాహితో బస్సుయాత్ర చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు ముందస్తు వ్యూహాలతోనే రాజకీయ క్షేత్రంలో ముందుకి కదులుతున్నారు. మరి ఈ ప్రయాణంలో ఎవరి వ్యూహాలు బలంగా ప్రజలలోకి వెళ్తాయి అనేది వేచి చూడాలి. ఇక ఎవరి బలాబలాలు ఏంటి అనేది అందరూ కూడా రాజకీయ క్షేత్రంలో ప్రజల మధ్యకి వస్తే పూర్హిగా బయటపడే ఛాన్స్ ఉంది.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

3 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

3 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

3 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

This website uses cookies.