Beauty Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే ఆ అందాన్ని పెంపొందించుకోవడం కోసం చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు అయితే చాలామంది చిన్న వయసులోనే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఎర్ర కలబంద చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాలి. సాధారణంగా మన ఇంటి పరిసరాలలో ఆకుపచ్చని కలబంద ఉంటుంది కానీ ఎర్ర కలబంద ఉపయోగించడం వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అదనంగా పొందవచ్చు. ముఖ్యంగా ఎర్ర కలబంద మొక్కలో
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, అమినోయాసిడ్స్ , పాలీశాకరైడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీబయోటిన్ గుణాలు సమృద్దిగా లభిస్తాయి
ఇలా ఎర్రని కలబంద గుజ్జులో ఉన్నటువంటి పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్యాన్ని మెరుగుపరచడంలో వీటి పాత్ర కీలకమనే చెప్పొచ్చు. చర్మం పై ముడతలు, వృద్ధాప్య లక్షణాలతో బాధపడేవారు వారంలో మూడుసార్లు కలబంద గుజ్జుతో ఫేషియల్ చేసుకుంటే కలబందలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మ కణాలకు నూతన శక్తిని పెంపొందించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే చిన్న వయసులో వచ్చే వృద్ధాప్య సమస్యలను కూడా తరిమికొడుతుంది.
ఈ కలబందలో ఎన్నో రకాల యాంటీ సెప్టిక్ ఏజెన్సీ ఉండటం వల్ల మొహంపై ఏర్పడినటువంటి మచ్చలు ముడతలు కూడా తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా అలాగే మృదువుగా ఉంటుంది.అలాగే ఈ కలబంద గుజ్జు జుట్టు కుదుళ్లకు కనుక రాయటం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరగడమే కాకుండా చుండ్రు సమస్యను కూడా లేకుండా చేస్తుంది. ఇలా చర్మ సౌందర్యంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడటంలో ఎర్ర కలబంద ఎంతో దోహదం చేస్తుంది
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.