AP POLITICS: ప‌వ‌న్‌కు అలా.. బొల్లాకు ఇలా.. ఎందుకీ వ్య‌త్సాసం..?

AP POLITICS: రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఎంత బలమైన ఆయుధమో, దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలో నాయకుల ద్వంద్వ నీతి కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. తెలంగాణ సమాజం, ఆత్మగౌరవం అనే పదాలను సందర్భాన్ని బట్టి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు ఎలా మార్చేస్తారో చెప్పడానికి తాజాగా హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన ఓ భూ కుంభకోణం, దానికి సంబంధించి సాగుతున్న నిశ్శబ్దమే దానికి నిదర్శనం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నకిలీ పత్రాలు, ఫోర్జరీ జీవోలతో తెలంగాణకు చెందిన అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు ఆయనను తమిళనాడులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిత్యం తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే రాజకీయ శక్తులు, కొందరు సీనియర్ జర్నలిస్టుల నుంచి దీనిపై కనీస స్పందన కరువైంది.

ap-politics-pawan-is-like-this-bolla-is-like-this-why-is-there-a-difference

AP POLITICS: ఆంధ్రాకు చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం

కొద్దిరోజుల క్రితం ఆంధ్రాకు చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేస్తానని, హైదరాబాద్‌లో సభ పెడతానని ప్రకటించినప్పుడు ఇక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రాంతీయ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తూ.. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆయన అసలు హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారో చూస్తామంటూ కొందరు హెచ్చరికలు జారీ చేశారు.

చివరకు వ్యక్తిగత ఆస్తులపైకి కెమెరాలు పంపి, ఆధారాలు లేకపోయినా పవన్ చెరువును కబ్జా చేసి ఫామ్‌హౌస్ కట్టారంటూ గంటల కొద్దీ డిబేట్లు నడిపారు. రాజకీయ విమర్శలను ప్రశ్నించినందుకు, దాన్ని మొత్తం తెలంగాణ సమాజంపై దాడిగా కలరింగ్ ఇచ్చారు. అప్పట్లో జనసేన, టీడీపీల విస్తరణను అడ్డుకోవడానికి ప్రాంతీయవాదాన్ని ఒక కవచంగా వాడుకున్నారు.

కానీ నేడు, సాక్షాత్తూ తెలంగాణ పోలీస్ శాఖే అధికారికంగా విచారించి, ఒక ఆంధ్రా ప్రాంత వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో దోచుకోవడానికి ప్రయత్నించాడని తేల్చినా.. నాటి సెంటిమెంట్ గళాలు నేడు మూగబోయాయి. తెలంగాణ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించిన పార్టీకి చెందిన నాయకుడు, ఇక్కడి సంపదను కొల్లగొడుతుంటే ఈ మౌన పాత్ర దేనికి సంకేతం?

ఆంధ్రా నాయకులు ఇక్కడ కేవలం రాజకీయం చేయడానికి వస్తేనే ప్రాంతీయవాదం గుర్తుకొస్తుందా? అదే ఆంధ్రా నేతలు ఇక్కడి విలువైన ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో దోచేస్తుంటే ఆ సెంటిమెంట్ ఎక్కడికి పోతుంది? ఈ ద్వంద్వ వైఖరిని చూస్తుంటే.. కొందరికి తెలంగాణ ప్రయోజనాల కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఉన్న అంతర్గత రాజకీయ బంధాలు, సమీకరణాలే ఎక్కువ ముఖ్యమా అనే అనుమానాలు కలగక మానవు.

రాజకీయ విస్తరణను తప్పుబడుతూ, ఆర్థిక నేరాలను, భూ కబ్జాలను రాజకీయ కక్షలంటూ వెనకేసుకురావడం ఏ రకమైన రాజకీయం? పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఒక న్యాయం, బొల్లా బ్రహ్మనాయుడు విషయానికి వచ్చేసరికి మరో న్యాయమా? ఈ వ్యత్యాసమే ఇప్పుడు సామాన్య ప్రజల్లో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్‌ను వాడుకుంటూ, అసలైన ద్రోహాలను చూస్తూ ఊరుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడమే అవుతుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.