Andhra Pradesh: జనసేనలో బిగ్ చేంజ్.. పవన్ ` 7 మెంబర్స్` ప్లాన్!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో బిజీగా ఉన్నప్పటికీ, అటు పార్టీని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తాజా సమావేశంలో పవన్ కల్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనను సంస్థాగతంగా సమూలంగా మార్చేందుకు ‘7 మెంబర్స్ ఫార్ములా’ను తెరపైకి తెచ్చారు.

సాధారణంగా ఏ పార్టీలోనైనా జంబో కమిటీలు వేస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రూట్ మార్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కేవలం ఏడుగురు సభ్యులతో కూడిన ఒక పవర్‌ఫుల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడుగురి టీమ్‌లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు, మహిళా ప్రతినిధులకు చోటు దక్కనుంది. పార్టీలో కీ రోల్ ప్లే చేయబోయే ఈ 7 మెంబర్స్ కమిటీలు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి.

andhra-pradesh-big-change-in-jana-sena-pawans-7-members-plan

Andhra Pradesh: జనసేనలో ఎలాంటి కొత్త జోష్ తీసుకురాబోతుందో

ఈ కొత్త కమిటీల్లో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌ను యాడ్ చేశారు పవన్ కల్యాణ్. 2014 నుంచి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నాయకులతో పాటు, ప్రతి కమిటీలో ఇద్దరు సాధక్‌లకు ప్రత్యేకంగా స్థానం కల్పిస్తున్నారు. వీరికి సపోర్ట్‌గా మరో 10 నుండి 25 మంది సాధక్‌లతో ఒక సమన్వయ బృందం బ్యాక్ ఎండ్‌లో పని చేయబోతోంది. అంటే గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ కోసం కష్టపడే డెడికేటెడ్ లీడర్లను గుర్తించి వారికి హైప్రాధాన్యత ఇవ్వడమే ఈ సాధక్ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం.

పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కమిటీల ఏర్పాటు, కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై ఈ 7 సభ్యుల కమిటీలదే కీ రోల్. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు, డాక్యుమెంట్లు స్వీకరించి, వాటిని వడపోసి పవన్ కల్యాణ్‌కు తుది నివేదిక ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని హైకమాండ్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఈ హడావుడి నెలల తరబడి సాగడానికి వీల్లేదని, కేవలం నాలుగు వారాల్లోనే ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. ఈ బిగ్ చేంజ్ జనసేనలో ఎలాంటి కొత్త జోష్ తీసుకురాబోతుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.