Technology: టెక్నాలజీ ప్రభావం పిల్లలపై ఎంతగా ప్రభావం చూపిస్తుందంటే..!

Technology: టెక్నాలజీ మన జీవితంలో అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. ఎన్నో విషయాలను ఈ టెక్నాలజీ సహాయంతోనే సులభంగా ఇంట్లో కూర్చునే తెలుసుకోగలుగుతున్నాము. వాటి వల్ల ఎంతో ఎదిగాము కూడా. ఇవి మన జీవితాలకు ఎంతో ఉపయోగకరం. సోషల్ మీడియాను హ్యాండిల్ చేయడం చాలా సులువు. ఇది వరకు సమాజం మాత్రమే ఉన్నప్పుడు భర్త, భార్య, పిల్లలు, స్నేహితులు, హితులు, అందరూ మిమ్మల్ని పట్టుకుంటే మీరు వారి నుంచి దూరంగా వెళ‌్లే పరిస్థితి ఉండేది కాదు.

కానీ అదే సోషల్ మీడియా లో నచ్చకపోతే మీ ఫోన్ స్విచ్‌ ఆఫ్ చేసి వదిలించుకోవచ్చు. మాధ్యమాలు లేని ప్రాచీన సమాజం కంటే ఈ మాధ్యమమే మనకు నచ్చింది చేసే స్వేచ్ఛను అందించింది. సోషల్ మీడియాలో ఓ చిన్న మెసేజ్‌తో సుదూరాన ఉన్న వారిని స్నేహితులను చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  ఈ సోషల్ మీడియా అనేది మన జీవింతంలో వచ్చిన అద్భుతమైన విప్లవం అని చెప్పక తప్పదు.

is Technology showing its effect on children

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎంతో కీలకపాత్ర పోషించింది. ఏడు సముద్రాల వెనుకనున్న దేశాల్లోనూ ఏం జరుగుతుందో నిమిషాల్లో తెలుసుకోగలిగే సాంకేతికత సొంత చేసుకున్నాము. ఏదైనా శోధించాలన్నా, పరిశోధనలు జరపాలన్నా, చదవాలన్నా, నిపుణుల సలహాలు తీసుకోవాలన్నా, కాలక్షేప సమయాన్ని గడపాలన్నా, పిల్లలకు ఆటవిడుపు కావాలన్నా సామాజిక మాధ్యామాల పుణ్యమా ఎంతో సులువుగా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇటీవల ఈ సోషల్ మీడియా సాధనంగానే ఎంతో మంది అభాగ్యులకు సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి.

అంతే కాదు ఎంతో మంది నిరుద్యోగులు ఈ టెక్నాలజీ సహాయంతో ఉపాధి అవకాశాలను పొందారు మొన్నామధ్య ఈ టెక్నాలజీ ప్రభావంతో రైల్వే మెన్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి గ్రూప్స్‌లో జాబ్ సంపాదించాడు. అదే విధంగా మారుమూల కుగ్రామంలో పాటలు పాడే కోయిలమ్మ, టీవి మాధ్యమాల్లో సెలబ్రిటీ సింగర్ గా మారిందంటే అది సోషల్ మీడియా పుణ్యమే అని చెప్పక తప్పదు. కరోనా పరిస్థితుల్లో స్కూళ‌్లకు వెళ్లలేని వేళల్లోనూ ఈ సోషల్ మీడియా సాయంతోనే ఇంట్లోనే చదువుకునే అవకాశం దక్కింది. ఈ టెక్నాలజీ కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు లాభాలు గడించాయి.

ఈ కాలం పిల్లలు పూర్తిగా మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్‌లతోనే రోజంతా గడుపుతున్నారు. దీని వల్ల వారిపై తీవ్రమైన ప్రభావం ఉంటుందన్నది అందరూ వాధిస్తున్న విషయం. నిజమే మరి రోజులో 5 నుంచి 10 గంటల ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా ఫోన్‌లు, లాప్‌ట్యాప్‌లు, ఐప్యాడ్‌ల ముందు గడుపుతున్నారు. ఇప్పుడంటే కరోనా కాస్త తగ్గినప్పటికీ ఫోన్‌ల ప్రభావం పిల్లలపై అప్పుడే పోదు. ఓ రకంగా ఈ మాధ్యమాల ద్వారానే ఇంట్లో ఉంటూ సురక్షితంగా పాఠాలు చదువుకో గలిగారు అక్కడి వరకు సంతోషించదగ్గ విషయమే కానీ అదే మితిమీరితో అసలుకే మోసం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో చంటి పిల్లల తల్లులు తీరిక లేక, పిల్లలు ఏడుస్తున్నారని, అన్నం తినడం లేదని వారు కుదురుగా కూర్చుని ఉండాలంటే ఫోన్‌ ఇస్తే సరిపోతుందని  భావిస్తున్నారు. నిజానికి అదే చేస్తున్నారు.

ఏడుస్తున్నా, అన్నాం తినాలన్నా, ఆఖరికి పడుకోవాలన్నా పిల్లల చేతుల్లో ఫోన్‌లు పెట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2వ ఏట పిల్లల నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు అందరూ ఈ మాధ్యమాలకు బానిసలవుతు న్నారు. ఒక్కసారి అలవాటు పడటం అదేపనిగా ఫోన్‌లకు అతుక్కుపోవడం వల్ల పిల్లలలో మరో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు ఫోన్‌లు లేకపోతే ఉండలేమన్న దోరణిలో ఉన్నారు. ఇది మాత్రం ఆందోళన చెందాల్సిన అంశమే. కానీ కొంత మంది పిల్లలు అదే ఫోన్‌లను వినియోగించుకుని విజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. తోటి వారికంటే ముందు వరుసలో ఉంటున్నారు.

నిజానికి టెక్నాలజీది ఏ తప్పులేదు. ఇది పూర్తిగా మానవ తప్పిదమే. మనుషుల కు ఉన్న విపరీతమైన అలవాట్ల వల్లనే సోషల్ మీడియాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పక తప్పదు. నిజానికి మనిషికి తింటుంటే ఎప్పుడు ఆపాలో తెలియదు, ఏది మొదలు పెట్టినా మనిషికి అది విపరీత అలవాటుగా మారిపోతోంది. ప్రస్తుతం ఈ గ్యాడ్జెట్లు , ఫోన్‌లు, అందిరికీ ఎంతో ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. అందుకని టెక్నాలజీని తప్పుబట్టలేము. మనిషి మైండ్ సెట్‌ను మార్చాలి. ఏదైనా కొత్తది వస్తే దాన్ని అనుసరించడం కాదు. ఓ వ్యసనంగా మార్చుకుంటున్నాడు.  కేవలం చైతన్యంతోనే దీనిని మార్చుకోవచ్చు. ఇది సాధించాలంటే చాలా సాధనాలు ఉన్నాయి. చిన్న వయస్సు నుంచే పిల్లలు ఏం చేస్తున్నామన్న విషయాన్ని గమనించాలి. ఒకసారి ఈ అవగాహన వస్తే ఎప్పుడు ఏది ఎంత చేయాలో అర్ధమవుతుంది. రేడియేషన్ విషయానికి వస్తే ఇదివరకు పొగత్రాగేవారికన్నా పక్కన టెక్నాలజీ వాడుతుంటే మొబైల్ ఫోన్స్ వాడుతుంటే దాని ప్రభావం నుంచి తప్పించుకోలేరు. జీవితం ఎంతో సులభతరం అవుతుందో తెలుసుకోవాలి.

ఏదైనా మనచేతుల్లోనే ఉంటుంది. అది విజ్ఞానానికి ముడి వేయాలో, విచ్చలవిడి తనానికి బాటలు వేయాలన్న విషయాన్ని మనమే గుర్తించాలి. ముఖ్యంగా తల్లి దండ్రలు బాధ్యత తీసుకోవాలి. పిల్లలు ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు వారు ఏం చేస్తున్నారో గమనించాలి. ఏ వీడియోలకు ప్రేరేపితులవుతున్నారో తెలుసుకుంటూ ఉండాలి. వారితో ఓ ఫ్రెండ్‌లా మెలగాల్సి ఉంటుంది. అప్పుడే పిల్లలు ఓపెన్  అవుతారు. వారు ఎలాంటి సమాచారానికి అట్రాక్ట్‌ అవుతున్నారో తెలుసుకోవచ్చు. మంచిదైతే అభినందించండి అదే చెడు మార్గాలను అన్వేషిస్తే మందలించండి అంతే కానీ నలుగురిలో వారిని చిన్నబుచ్చకండి మరీ ముఖ్యంగా అప్పుడే యుక్త వయస్సుకు వచ్చిన పిల్లల పట్ల పేరెంట్స్ మరింత సున్నితంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైతే కాస్త కౌన్సిలింగ్ ఇవ్వడం. అంతే కానీ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పిల్లలు పాడవుతున్నారని వాధించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అన్నింట్లో మంచి చెడులు ఉన్నట్లే ఇందులోనూ ఉన్నాయి. కాబట్టి మంచిని సేకరించి మన మేథాశక్తిని వినియోగించుకుని ముందడుగు వేద్దాం. నవ సమాజాన్ని తీర్చిదిద్దుదాం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 weeks ago

This website uses cookies.