Technology: మొబైల్ కు అడిక్ట్ అయ్యారా… అవాయిడ్ చేయడం ఎలా?

Technology:  ఉదయం లేచింది మొదలు రాత్రి కాదు కాదు అర్థరాత్రి వరకు అందరూ ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌లనే విపరీతంగా వాడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా గంటల తరబడి ఫోన్‌లను వాడుతూ వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్‌లకు విపరీతంగా అడిక్ట్‌ అయ్యారని చెప్పాలి. పొద్దున్నే లేవడం వాట్సాప్ అని ఫేస్‌‌బుక్ అని, ట్విట్టర్ అని ఇన్‌స్టాలని ఫోన్‌ల ముందు వాలిపోతున్నారు. ఒకప్పుడు ఉదయం లేవగానే పేపర్ చదవడం వాకింగ్‌ కు వెళ్లడం నలుగురితో మాట్లాడటం వంటివి జరిగేవి.

కానీ రాను రాను మనుషులతో సంబంధాలే లేకుండా మరమనిషి మత్తులో ఊగిపోతున్నవారిని చూస్తుంటే జాలిపడాలో, భయపడాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంటోంది. సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీని వాడవద్దని ఎవరూ చెప్పడం లేదు అదే పనిగా వాటికే వ్యసనపరులుగా మారి మనిషి తో మనిషికి సంబంధం లేకుండా మారకూడదన్నదే అసలు విషయం. పిల్లలు, మొదలు, పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్‌లను తెగ వినియోగిస్తున్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే వారందరికీ ఫోన్‌ లు కంపల్సరీ అయిపోయాయి. ఒకరు స్టాటస్ అని మరొకరు కమ్యూనికేషన్ అని వారి వారి మాటల్లో చెబుతున్నప్పటికి విపరీతంగా ఫోన్‌లకు అడిక్ట్ అవ్వడం వల్ల మానవ సంబంధాలు మసక బారుతున్నాయి.

how to get rid of using mobiles

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చేస్తున్నాయి స్మార్ట్ ఫోన్‌లు భర్త ఉద్యోగం పూర్తయ్యి ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆఫీస్‌ వర్కుతో ఫోన్‌లకు అతుక్కుపోతాడు. భార్య మాట్లాడేవారు లేక కాలక్షేపం, సరదా కోసం ఫోన్‌లనే ఆశ్రయిస్తారు. ఇక పిల్లలు బయటికి వెళ్లే పరిస్థితి లేక, మిత్రులు లేక ఆడుకునే వారు లేక టైంపాస్ కోసం ఫోన్‌ లలో గేమ్స్ అని వారు గంటల తరబడి ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. ఏదో పేరుకే ఇంట్లో కుటుంబంగా ఉంటున్నారే కానీ వారిలో ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు అన్నీ దూరమవుతున్నాయి. విపరీతమైన ఫోన్ వాడకం వల్ల కోపాలు, సైకిక్ మెంటాలిటీ కూడా పెరిగిపోతోంది. అంతే కాదు ఫోన్ ల నుంచి వచ్చే కాంతి వల్ల నిద్రలేమి సమస్య కూడా చాలా మందిని వేధిస్తోంది. నిద్ర లేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఏమాత్రం ఆలోచించకుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఫ్యామిలీతో ఫన్‌ టైమ్ ను మిస్‌ చేస్తూ ఫోన్‌లపైన మమకారం పెంచుకుంటున్నారు.

ఫోన్‌ల వాడకం వల్ల భార్య భర్తల మధ్య చాలా గ్యాప్ వస్తోంది. వీరిద్దరికీ అపోహలు అనుమానాలు పెరిగి పోతున్నాయి. భార్యా భర్తలిద్దరూ ఒకరినికరు పట్టించుకోకుం డా మరీ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఫోన్‌లను చాలా పర్సనల్ గా ఫీల్ అవుతున్నారు. వారి ఫోన్‌లకు లాక్స్ పెట్టేస్తున్నారు. అంతే కాదు చాటింగ్ ఆప్‌లకు సెక్యూరిటీ పిన్ లను పెట్టేస్తున్నారు. కారణంగా పర్సనల్‌గా భార్యాభర్తల మధ్య అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇంట్లో ఇద్దరే ఉన్నా కాస్త ప్రేమగా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అవసరం ఉంటేనే మాట్లాడాలి అన్న సిచువేషన్ ఉంది ప్రస్తుతం. ఒకరు మరొకరి ఫోన్‌లను ముట్టుకుంటే చాలు తెగ హర్టయిపోతుంటారు. దీంతో ఎవరి లైఫ్ వారిదైపోతోంది. కారణంగా చాలా వరకు భార్యా భర్తలు తమ వివాహ బంధానికి బ్రేక్ కూడా వేసేస్తున్నారు.

కాలేజ్ పిల్లలూ ఈ మొబైల్ ఫోన్స్ కు తెగ ఎడిక్ట్ అయిపోతున్నారు. పబ్‌జీలనీ, ఫైటింగ్ సీరీస్ లాంటి హింసాత్మకమైన ఆటలకు అలవాటు పడుతున్నారు. దీంతో తెలియకుండానే వారి మనస్తత్వంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటు న్నాయి..ఫోన్ ఛార్జింగ్ అయిపోతే చాలా హైరానా పడుతున్నారు. బస్సుల్లో బైకు ల్లో, ట్రైనుల్లో ప్లేస్‌ ఏదైనా పనేంలేదని అరచేతుల నుంచి వచ్చే వెలుతురు వైపే చూసేందుకు అడిక్ట్ అయిపోతున్నారు. మరికొంత మంది ఛార్జింగ్‌లు పెట్టి మరీ ఫోన్‌లతో కాలక్షేపం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

టెక్నాలజీ, సోషల్ మీడియాల తప్పేమి లేదు. ఇంతలా స్మార్ట్ ఫోన్‌లకు బానిసలు కావడం వెనకాల కారణం ఖచ్చితంగా మనమే అని సెల్ఫ్ డిక్లరేషన్‌కు రావాలి. ఏది ఎంత వాడాలో, ఎంత వరకు అవసరమో అన్న సింపుల్ లాజిక్‌ను గుర్తించక పోవడం వల్లే ఫోన్‌ లకు ఎడిక్ట్ అయ్యి ప్రశాంతతకు దూరం అవుతున్నాము. చాలా మంది ఫోన్‌ వాడకం నుంచి బయట పడలేమని, ఒకసారి అలవాటైతే అంతేనని సవాలక్ష కహానీలు చెబుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదు. మీ అంత మీరు సెల్ఫ్ గోల్ పెట్టుకోండి. మీ లక్ష్యం ఏమిటో గుర్తుంచుకోండి. ఫోన్ ల వాడకం వల్ల ఎంతటి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారో తెలుసుకోవాలి. ముఖ్యం గా స్టూడెంట్స్ ఫోన్ మాయలో పడి తమ కెరీర్ పై దృష్టి సారించలేకపోతున్నారు.

గంటల తరబడి సోషల్ మీడియాలకు అతుక్కుపోతు న్నారు. ఇది కాదు మీ లక్ష్యం. ఇంట్లో పెద్దలు రేయనక పగలనక మీ చదువుల కోసం కష్టపడుతుంటూ మీరు మాత్రం ఎంజాయ్ చేయడం ఏమాత్రం సరికాదు. పెద్దలు మీరు కూడా ఇంటి బాధ్యతలు మోస్తున్నానని కాస్త ఫోన్ లో టైం పాస్ చేస్తున్నానని చెప్పడం కాదు. ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ప్రతి సందర్భంలో ఎంతలా మిస్ అవుతున్నారో తెలుసుకోండి. మీ భార్య పిల్లలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుంటే ఫోన్‌ అడిక్షన్ నుంచి ఎలా బయట పడవచ్చో ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు.

ఫోన్ వాడాలని అనిపించినప్పుడల్లా దానికి ప్రత్యామ్నాయంగా ఓ పని చేయాలని నిర్ణయించుకోండి. పనే కాదు పిల్లలతో ఆడుకోవడం, భార్యతో మాట్లాడటం, అమ్మానాన్నలతో విలువైన సమయాన్ని గడపడం, లేదా పేపర్ చదవడం, లేదా కథల పుస్తకాలను తిరగేడం వల్ల మెదడుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. వీటిన్నింటిని సహజంగా పొందాల్సిన మీరు ఫోన్ లకు అడిక్ట్ అయ్యి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు మీలో మార్పు తీసుకురండి. ఫోన్ అడిక్షన్ నుంచి దూరం కండి. నవ
సమాజాన్ని నిర్మించండి. కుటుంబ విలువలను కాపాడండి.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.