Health Tips: మన రోజువారి దైనందిన జీవితంలో నిద్ర కూడా ఒక భాగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి మనిషి రోజుకి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సు బట్టి నిద్రపోయే సమయం కూడా ఉంటుంది. చిన్నారులు అయితే రోజుకి 12 గంటలకి పైగ నిద్రపోవాలి. అలాగే యుక్త వయస్సు దాటిన తర్వాత మన రోజువారి జీవితంలో కచ్చితంగా 8 గంటలు నిద్రకోసం కేటాయించాలి. గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు రాత్రి 8 గంటలకి నిద్రపోయి ఉదయం 5 గంటలకి మేల్కొనే వారు. అయితే పట్టణ సంస్కృతి పెరిగిన తర్వాత నిద్రపోయే సమయం క్రమంగా తగ్గిపోయింది. రాత్రి 11, 12 గంటల వరకు మెలుకువగా ఉంటున్నారు.
అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారు మాత్రం కాస్తా వేగంగా నిద్ర లేస్తున్నారు. అయితే ప్రస్తుతం సగటున ప్రతి మనిషి నిద్రపోయే సమయం 4 నుంచి 6 గంటల మధ్యనే ఉంటుంది అనేది పరిశోధనల ద్వారా తేలిన నిజం. ఇదిలా ఉంటే దేశం లో 30 నుంచి 40 శాతం మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యని ఎన్ సోమేనియా అని అంటారు. ఈ వ్యాధి బారిన పడే వారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకోవాలని ప్రయత్నం చేసినా కూడా గంటల తరబడి మనసు నిద్ర మీద లగ్నం కాదు. రకరకాల ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణల కారణంగా నిద్రలేమి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
యుక్త వయస్సు నుంచి ఈ సమస్యలు ప్రతి వ్యక్తిలో ప్రారంభం అవుతాయి. అయితే ఈ మానసిక సమస్యలు కొంత మంది అధికమిస్తారు. అయితే మెజారిటీ ప్రజలు ఈ మానసిక సమస్యలతో సతమతం అవుతూ నిద్రపోలేకపోతారు. నిద్రపోకుంటే మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అలాగే బీపీ పెరుగుతుంది. తీవ్రమైన అలసటకి గురవుతారు. శారీరక సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతుంది. జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతర్గత రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలు వస్తాయి. పెరాలసిస్ బారిన పడే ప్రమాదం ఉంది. ఆత్మన్యూనతా భావం పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇవన్ని కూడా నిద్రలేమి సమస్యలతో వస్తాయి. అయితే నిద్రలేమి నుంచి బయటపడాలంటే ముందుగా మనస్సులో ఉన్న ఒత్తిడి మొత్తం దూరం చేసుకోవాలి.
అలాగే అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అదే పనిగా టెన్షన్ కి గురి కాకూడదు. ఒత్తిడికి గురి చేసే దృశ్యాలు చూడకూడదు. నిద్రపోయే సమయంలో లైట్స్ అన్ని ఆర్పేసే ప్రయత్నం చేయాలి. అలాగే చీకటిని మనస్సుకి అలవాటు చేసుకోవాలి. చీకటి పడితే నిద్రసమయం అయ్యిందనే విషయాన్ని మనస్సుకి అలవాటు చేయాలి. అలాగే నిద్ర సమయం వచ్చినపుడు కళ్ళు మూసుకొని ఆలోచనలకి విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏవైనా అనవసరమైన ఆలోచనలు మనస్సులోకి వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఇష్టమైన వ్యక్తులని, లేదా దైవాన్ని చూడటం చేయాలి. అలాగే పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకోవాలి. వీలైనంత ప్రశాంత స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.