Education: ప్రస్తుతం సగానికి సగం మంది విద్యార్థినీ, విద్యార్థులలో 10వ తరగతి తర్వాత ఏ కోర్సు తీసుకోవాలో తెలియక చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ గనక పొరపాటున రాంగ్ స్టెప్ వెస్తే ఆ ప్రభావం పూర్తిగా కెరీర్ మీద పడుతుంది. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్‌లో 10 వరకు చదువుకున్న విద్యార్థులు ఆ తర్వాత ఎంపీసి, ఎంఈసి, బైపీసి, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సులలో ఏది ఎంచుకోవాలన్నది 10వ తరగతి వరకు వారు ఎక్కువ మార్కులతో పాటు సబ్జెట్‌లో నాలెడ్జ్ ఆధారంగా డిసైడ్ చేసుకోవాలి. 7వ తరగతి నుంచి ఏ సబ్జెక్ట్‌లో విద్యార్థులకు ఆసక్తి ఉంటుందో ఎందులో ఎక్కువగా మార్కులు వస్తున్నాయో 10వ తరగతిలో ఎక్కువగా ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ పర్సెంటేజ్ సాధిస్తారో దాన్ని బట్టి ఇంటర్‌లో గ్రూప్ ఎంచుకోవాలి.
చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు పిల్లలకు ఆసక్తి ఉన్న గ్రూప్ కాకుండా తమకి ఇష్టమైన గ్రూప్ తీసుకోని రూటు మార్చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఇలా వారు అనుకున్న గోల్ అండ్ డ్రీమ్ మిస్ అవుతున్నారు. అలా కాకుండా తమ పిల్లలకు నచ్చిన సబ్జెక్ట్, ఆసక్తి ఉన్న గ్రూప్ గనక ఇంటర్‌లో తీసుకుంటే సాధ్యమైనంత వరకు వారు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది.
10వ తరగతిలో ఓ విద్యార్థికి లేదా విద్యార్థినికి మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్‌లో గనక ఎక్కువ మార్కులు వస్తే సైన్స్ గ్రూప్ తీసుకునేలా ఎంకరేజ్ చేయాలి. కొంత మంది తల్లిదండ్రులు తమ ఆర్ధిక స్తోమతను దృష్ఠిలో పెట్టుకొని పై చదువలకు వెళ్ళినప్పుడు చదివించలేమనే ఆలోచనతో ఖర్చు తక్కువగా అయ్యే కోర్సులను తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నాలెజ్డ్ ఉన్న సబ్జెక్ట్‌ను వదిలేసి వేరే కోర్సులలో చేర్పిస్తే ఫలితంగా చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేయాల్సి వస్తోంది. దీనివల్ల కెరీర్ మొత్తం తారుమారయి ఏదో చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
చాలా మంది తల్లిదండ్రులకు ఈ విషయంలో అవగాహన లేక ఆర్ధిక స్థోమత సరిపోకనే ఇలా జరుగుతుంది. అయితే, మెరిట్ స్టూడెంట్స్‌కు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఆయా విద్యార్థులకు ఉచితంగా విద్య చెప్పించేందుకు లేదా రిలీఫ్ ఫండ్ అంతేకాదు, స్టైఫండ్స్, స్కాలర్ షిప్స్ సహాయంతో కూడా విద్యార్థులు తమ గోల్ రీచ్ అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా సహాయ పడుతున్నాయి. ద్వారా పై చదువులు చదువుకునే వీలు కల్పిస్తున్నారు. అంతేకాదు, బ్యాంకులు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. చదువు పూర్తై ఉద్యోగం వచ్చాకే తిరిగి తీసుకున్న లోన్ కట్టుకునే వెసులుబాటు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
కాబట్టి ఆసక్తి ఉన్న కోరులలో విద్యార్థులను తల్లి దండ్రులు ఎంకరేజ్ చేయాలి. పూర్తిగా మాథ్స్ లేదా సైన్స్, లేదా సోషల్ సబ్జెక్ట్స్, లేదా లాంగ్వేజస్ మీద పట్టు ఉన్న విద్యార్థులను అందుకు సంబంధించిన గ్రూపుల్లోనే జాయిన్ చేయాలి. ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సులలో జాయిన్ అయ్యే విద్యార్థుల విషయంలో కూడా అమ్మా నాన్నలు ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ఇంటర్‌లో గనక ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ లేదా బిఎస్‌సీ వంటి సైన్స్ అండ్ మాథ్స్ గ్రూపులలో జాయిన్ చేయాలి.
సాధారణంగా ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసేందుకే ఆసక్తి చూపిస్తారు. అయితే, కొందరు మాత్రం ఇంజనీరింగ్ కంటే కూడా డిగ్రీ అయితే బాగా చదవగలమనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలాంటప్పుడు వారిని డిగ్రీ కోర్సులలో చేర్పించడమే ఉత్తమం. అలా కాకుండా తమ తోటి పిల్లలు ఇంజనీరింగ్ చేరుతున్నారనే కారణంతో నువ్వూ బీటెక్ చేయాలి అని తల్లిదండ్రులు పట్టుపడితే గనక నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేయలేక బ్యాక్ లాగ్స్ ఉండిపోయి బీటెక్ పూర్తి చేయడం కష్టమవుతుంది. జస్ట్ పాస్ మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసినా కూడా కొన్ని ఉద్యోగాలకు అర్హులు కారు. కాబట్టి ఇంటర్ ఆ తర్వాత ఎంచుకునే రూట్ చాలా క్లియర్‌గా ఆలోచించుకోవాలి.
ఇక ఇంజనీరింగ్ కాకుండా చాలా మంది స్టూడెంట్స్ మెడిసిన్ చేయాలనుకుంటారు. ఇది ఇంజనీరింగ్ కంటే కూడా చాలా కష్టతరమైనది. మెడిసిన్ చేయాలనుకున్న విద్యార్థులు రోజులో కనీసం 15 నుంచి 18 గంటలు చదువుకే కేటాయించాలి. దీనికి తగ్గట్టు సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా దృష్ఠిపెట్టాలి. ఇక మెడిసిన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువగా విదేశాలలో డాక్టర్ కోర్సులను చేయాల్సి వస్తుంది. దీనికి ఎక్కువగా ఆర్ధిక స్థోమత అవసరం. బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నా కూడా డాక్టర్ అవ్వాలంటే నిత్యం శ్రమించాలి..కృషి చేయాలి. అప్పుడే ఎంచుకున్న డాక్టర్ కోర్సులలో స్పెషలైజేషన్‌ను పూర్తి చేయగలుగుతారు. మెడిసిన్ చేయాలనుకున్న వారు ఒకటికి పదిసార్లు అన్నీ రకాలుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి.
అలాగే, లాయర్ అవ్వాకలనుకునే వారు..టీచర్, లెక్చరర్ అవ్వాలనుకునే వారు..లేదా ఫిజికల్ టీచర్ కోర్సులు చేయాలనుకునేవారు ఆయా రంగాల మీద ఆసక్తి పట్టుదల ఎంతో అవసరం. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దేన్నైనా సవాల్‌గా తీసుకోవాల్సిందే. అప్పుడే మీకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక అందరూ వెళ్ళే రూట్‌లలో కాకుండా పైలెట్, ప్యారా మెడికల్ కోర్సులు, కానిస్టేబుల్, ఎస్ ఐ, ఐఏఎస్, నేవీ, ఆర్మీ లాంటి రంగాలలో స్థిర పడాలనుకున్నవారు, బ్యాంకులలో ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న వారూ దానికి తగ్గ కోర్సులలో మాత్రమే అడుగుపెట్టాలి. లక్ష్యం ఒకటైతే, పరిస్థితుల ప్రభావం వల్ల ఒకవైపు ప్రయాణించడం వల్ల జీవితం అయోమయంగా మారుతుంది. అందుకే, చదువు విషయంలో ఎంచుకునే మార్గం విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే బాధ్యత తల్లిదండ్రులదే కాదు..తమ సత్తా ఏంటో ఎందులో చూపించగలరో ఆ విద్యార్థులది కూడా.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.