Education: పూర్తిగా చదువు మీదే దృష్ఠి ..క్రీడా రంగంపై ఆసక్తి ఎందుకు తగ్గుతుందంటే..

Education: ఐఐటి, నీట్ లాంటి కోర్సులు, ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటూ వయస్సుకు తగ్గ చదువులు కాకుండా ఫిజికల్ ఆక్టివిటీస్ లేని చదువుల వల్లో పిల్లల్లో అధిక భారం ఏర్పడుతోంది. ఈ విషయం తల్లిదండ్రులకు అర్థమయ్యేది ఎప్పుడు అన్నది ఇప్పుడు ప్రశ్న. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ కేవలం పుస్తకాల పురుగులుగానే తయారు చేస్తామంటేనే అసలుకు మోసం వస్తుంది. పుస్తకాల ముందు గంటల కొద్దీ సమయాన్ని గడిపే పిల్లలు అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. బయటి ప్రపంచం తెలియకుండా కేవలం స్కూల్, ఇళ్లు, ట్యూషన్స్‌, ప్రైవేటు క్లాసుల్లోనే తమ బాల్యాన్ని కడుపుతున్నారు.

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రతి పిల్లవాడు అందుకు తగ్గట్టుగా తయారవ్వాలని పేరెంట్స్ పిల్లాడు కడుపులో ఉన్నప్పటి నుంచే తెగ ప్లానింగ్ చేస్తుంటారు. ఏ స్కూల్‌ లో చదివించాలి, ఎలాంటి కోర్సులు నేర్పించాలి, ఎక్కడ ట్యూషన్‌లు పెట్టించాలన్న ఆలోచనలతోనే ముందుకు సాగుతుంటారు.. పిల్లలు కూడా పుస్తకాలతో గంటల తరబడి సమయాన్ని గడుపుతారు. కానీ వారికి ఎలాంటి ఫిజికల్ ఆక్టివిటీస్ పైన అవగాహన ఉండదు. దీంతో మిగతా పిల్లలకు ఈ పిల్లలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగతా వారిలాగా ఉల్లాసంగా వీరు వారి బాల్యాన్ని గడపలేరు. తోటి మిత్రులతో హాయిగా ఆడుకోలేరు. ఇలా అనేక రకాలు మిగతా పిల్లలకు వీరికి మధ్య తేడాలు ఏర్పడుతుంటాయి.

are you concentrating only on your child education not on sports

ప్రతి పిల్లవాడికి చదువుతో పాటు ఫిజికల్ ఆక్టివిటీస్ తప్పనిసరి. అందులో ఏజ్‌ను బట్టి కూడా ఫిజికల్ గా ఆక్టివ్‌గా ఉండాల్సి ఉంటుంది. మూడు నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు నిరంతరం రోజంతా ఏదో ఒక ఫిజికల్ ఆక్టివీస్‌ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక 6 నుంచి 17 ఏళ్ల పిల్లలు రోజులు కనీసం 60 నిమిషాలు అయినా ఫిజికల్ ఆక్టివిటీస్ చేస్తుండాలి. ఇదేమి కష్టమైన పనేమి కాదు, కానీ ఇలా ఫిజికల్ గా ఫిట్‌గా ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే మార్పు అనూహ్యంగా ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు రోజంతా ఫిజికల్ ఆక్టివిటీస్ చేయడం వల్ల వారి మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. మిగతా వారితో పోల్చుకుంటే వారు ఆడుకునే సమయాల్లో చాలా ఆక్టివ్‌గా ఉంటారు.

ఇక 6 నుంచి 17 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజు గంట సేపు వాకింగ్, లేదా రన్నింగ్, లేదా ఎరోబిక్స్ చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవే కాదు వారి హార్ట్‌ బీట్ వేగంగా కొట్టుకునేలా వారు ఏదో ఒక ఆక్టివిటీ చేస్తుండాలంటారు నిపుణులు. ఇలా చేయడం వల్ల వారి కండరాలు ధృడంగా తయారవుతాయి. వారి యముకలు గట్టిపడతాయి. ఇవే కాదు ప్రతి రోజు పిల్లలు స్కూల్‌కి తోటి మిత్రులతో కలిసి నడిచి వెళ్లడం వల్ల కూడా వారు ఫిజికల్ ఆక్టివిటీ చేసినట్లే.

అప్పట్లో పిల్లలకు ప్రత్యేకంగా ఫిజికల్ ఆక్టివిటీస్ చేయించమని ఎవ్వరూ చెప్పేవారు కాదు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆక్టివ్ గానే ఉండేవారు. కారణం అప్పట్లో పిల్లలు సుదూరంగా ఉన్న స్కూల్స్‌కు నడుచు కుంటూ వెళ్లేవారు. కిలోమీటర్ల కొద్ది నడుస్తూ మిత్రులతో వెళ్లేవారు. అంతే కాదు అప్పట్లో ఫోన్‌లు లేవు కాబట్టి ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా పిల్లలు స్కూల్ ముందు ఏదో ఒక ఆట ఆడేవారు. అందుకే వారు చాలా చలాకిగా ఉండేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి రోజుల్లో అసలు ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ కోకొల్లలు మనకు కనిపిస్తాయి. కేవలం పిల్లలను చదువుకునే యంత్రాలుగా తయారు చేసే పాఠశాలలు ఉన్నాయి.

గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోబెడుతూ వారికి ఎలాంటి ఫిజికల్ ఆక్టివిటీస్ లేకుండా మరబొమ్మల్లా తయారు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం పిల్లలకు ర్యాంకులు కోసం మాత్రమే కాకుండా వారి ఫిజికల్ ఆక్టివిటీస్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సబ్జెక్టు కు ఒక తరగతి ఉన్నట్లే వారికి ఫిజికల్ ఫిట్‌ నెస్‌ను అందించే విధంగా ఓ తరగతిని ఏర్పాటు చేయాలి. అందులో ఏరోబిక్స్, యోగా, లేదా ఏదైనా ఆటలో ఆడిస్తూ మరి శారీరక, మానసకి అభివృద్ధికి కృషి చేయాలి. 6 నెలలో ఒక్కసారైనా స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలి. వారిలో మరో కోణాన్ని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి.

తల్లిదండ్రులు పిల్లల చదువుపైనే ధ్యాస ఉంచకుండా వారికి ఏదో ఒక స్పోర్ట్ నేర్పించాలి. అందుకోసం మీరు కూడా వారితో కలిసి కాస్త సమయాన్ని వెచ్చించాలి. ఎంత సేపు ఈ ర్యాంక్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, అందులో సీట్ కొట్టాలి, ఫ్యూచర్ బాగుండాలని చదుపు పైనే ఫోకస్ చేసి వారిలో ఒత్తిడిని తీసుకురావడమే కాకుండా వారికంటూ, వారి పిజికల్ స్ట్రెంత్ కోసం రోజులో గంటైనా సమయాన్ని కేటాయించాలి. ఇక కరోనా సంక్షోభ సమయంలో పిల్లల ఈ మూడేళ్లు ఎలాంటి ఆట పాటల జోలికి వెళ్లకుండా చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లతోనే కాలక్షేపం చేశారు. చాలా మంది చిన్నారులు, ఫోన్‌ల నుంచి వెలువడే నీలి కిరణాల కారణంగా కంటికి కళ్లద్దాలను తెచ్చుకున్నారు.

బయట పరిస్థితి బాగోలేదు నిజమే కానీ ఇంట్లో ఉన్నారు కదా అని వారిని యంత్రాలకు బానిసలుగా తయారు చేయకండి. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది డబులు బెడ్ రూములలోనే ఉంటున్నారు. ఆ వెసులుబాటు లేకపోయినా ఇంట్లో హాల్‌లోనూ ప్రత్యేకమైన గదిలోనూ వారు ఫిట్‌నెస్ గా తయారయ్యే విధంగా అవసరమైన సాధనాలను ఏర్పాటు చేయండి ఆ స్థోమత లేకపోతే వారు ఏ విధమైన వ్యాయామాలు చేయాలో ఫోన్‌ల ద్వారా చూసి నేర్పించండి. ఇలా చేయడం వల్ల అప్పటి వరకు ఏదో కోల్పోయిన వారిలా ఉన్న పిల్లలు ఎంతో చురుగ్గా తయారవుతారు. మరి పేరెంట్స్ ఇకనైనా క్లాసులు, కోర్సులు, చదువులు అని కాకుండా పిల్లల ఫిజికల్ ఫిట్‌నెస్‌పైన కాస్త ఫోకస్ చేయండి. చేస్తారుగా.

 

 

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

14 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

15 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.