khaidi no 150 movie review and rating

0
3384

khaidi number 150 move review and rating

సినిమా : ఖైదీ నెంబర్ 150 రివ్యూ రేటింగ్‌
నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, కాజల్, బ్రమ్మనందం, పోసాని, పృథ్వి, అలీ తదితరులు
దర్శకుడు : వి వి వినాయక్
నిర్మాత : రామ్ చరణ్ తేజ
బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
ఎడిటర్ : గౌతం రాజు
విడుదల తేది : 11-1-2017
తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమా మెగాస్టార్ న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150 . ఈ సినిమా 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చాల మంది అభిమానులగుండెల్లో పదిల స్థానం ఏర్పరుచుకున్న ఒక బ్రాండ్.

దాదాపు ఆయన సినిమాలకి దూరం అయ్యి 9 సంవస్తరాలు అవుతుంది. ఆ తరుణం రానే వచ్చింది. త‌న‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదలు అయినప్పటినుండి ఈ సినిమా పై బారి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకుందో లేదో చూద్దాం.

కథ :
రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లాలోని నీరూరు అనే ఊర్లో  ఖైదీ సినిమా స్టార్ట్ అవుతుంది. అనంత‌పురం జిల్లాలో శంక‌ర్ భూగ‌ర్భ జ‌లాల‌పై ప‌రిశోధ‌న చేస్తుంటాడు. నీరూరు అనే గ్రామంలో ఉన్న భూగ‌ర్భ జ‌లాల‌ని స‌రిగా ఉప‌యోగించుకుంటే రైతులకి క‌రువు తీరుతుంద‌ని అర్థం చేసుకుంటాడు. నీరూరుకు చెందిన వృద్ధ‌ల‌ను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చ అక్క‌డ హైకోర్టులో వారి త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు. ఇది ఇలా వుంటే దొంగ‌త‌నాలు క‌త్తిశ్రీ‌ను క‌ల‌క‌త్తా జైలులో శిక్ష అనుభ‌వ‌విస్తుంటాడు. అదే జైలులో ఒక ఖైదీ పారిపోవ‌డంతో అత‌న్ని ప‌ట్టుకునేందుకు ఖైదీల ప్లాన్స్‌ని ఇంకోక ఖైదీనే అర్థం చేసుకోగ‌ల‌డ‌ని క‌త్తిశ్రీ‌ను ని జైలు అధికారులు హెల్ప్ అడుగుతారు. ఆ ఖైదీ ని ప‌ట్టుకోవ‌డానికి క‌త్తిశ్రీను అధికారుల‌కి స‌హ‌క‌రించి, తాను త‌ప్పించుకుంటాడు.

అక్క‌డ్నించి హైద‌రాబాద్ వ‌చ్చి. విదేశాల‌కి వెళ్లి సెటిల్ అయిపోవాల‌నుకుంటాడు. కానీ హైద‌రాబాద్‌లో ల‌క్ష్మి(కాజ‌ల్‌) చూసి ల‌వ్ లో ప‌డ‌తాడు. త‌న కోసం విదేశాల‌కి వెళ్లే ప్లాన్ మానుకుంటాడు. అయితే అక్క‌డ ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్ట‌రీ పెట్టాల‌ని అగ‌ర్వాల్ అనే బ‌డా వ్యాపార‌వేత్త ప్లాన్ చేస్తాడు. ఆ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్న శంక‌ర్ పై హ‌త్యాయ‌త్నం చేస్తారు. గాయాల‌తో ఉన్న శంక‌ర్ ను క‌త్తిశ్రీ‌నె చూసి హాస్సిట‌ల్‌లో చేరుస్తాడు. అచ్చుత‌న‌లాగానే ఉన్న శంక‌ర్ ప్లేస్‌లో క‌త్తిశ్రీనె శంక‌ర్ న‌డుపుతున్న వృద్దాశ్ర‌మానికి వెళ్తాడు. అక్క‌డ ఉన్న డ‌బ్బు కాజేద్దామ‌ని అనుకున్న క‌త్తిశ్రీను కి శంక‌ర్ గొప్ప‌త‌నం తెలుస్తుంది. శంక‌ర్ మొద‌లు పెట్టిన ప‌నిని తాను పూర్తి చేయాల‌ని డిసైడ్ అవుతాడు. మ‌రో ప‌క్క శంక‌ర్ చూసి క‌త్తిశ్రీ‌ను అనుకోని పోలీసులు తీసుకెల్తారు. కొన్నాళ్ళ‌కి జైలు నుంచి త‌ప్పించుకున్న శంక‌ర్ త‌న గ్రామ రైతుల కోసం శ్రీ‌ను చేస్తోన్న పోరాటం చూసి ఏం చేశాడు?  ఫైన‌ల్‌గా శ్రీ‌ను ఏం చేశాడు చివ‌ర‌కు ఈ క‌థ ఎలా ముగిసింది అన్న‌దే ఈ స్టోరీ.

విశ్లేషణ:
మొదటగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించే. అత్యద్భుతంగా నటించి మెప్పించాడు. సినిమాలో అయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. సెంటిమెంట్ సీన్లలో అయన పెర్ఫార్మెన్స్ చాల బాగుంది. ఇక డాన్సుల విషయంలో అయన గురించి వేరే చెప్పేదేముంది. చిరంజీవి గారి అభిమానులకైతే ప్రతి పాట ఒక ఫెస్టివల్ ఫీస్ట్ ల ఉంటుంది. చిరంజీవి గారిలోని మరో స్పెషాలిటి అయన కామెడీ టైమింగ్. మరోసారి అది రుజువు చేసాడు.

కాజల్ సినిమాలో చాల అందంగా కనిపిస్తుంది. తన అభినయంతో ఆకట్టు కుంటుంది. ఇంకా విలన్ గా చేసిన తరుణ్ అరోరా కూడా బాగా చేసాడు. ఇక్కడ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాల అద్భుతంగా చిత్రీకరించాడు రత్నవేలు. మాస్ కి కావలసిన పాటలు అందించడం లో దేవిశ్రీ విజయవంతం అయ్యాడు. నేపధ్య సంగీతం కూడా బాగుంది. మిగిలిన నటినటులు వారి వారి పాత్ర పరిధి మేర బాగానే నటించారు.

ప్లస్ లు:
చిరంజీవి వన్ మాన్ షో
కథ
పాటలు
సినిమాటోగ్రఫీ
నేపధ్య సంగీతం
కాజల్ అందం మరియు అభినయం
సెంటిమెంట్ సన్నివేశాలు

మైనస్ లు:
మాతృకలోని కొన్ని మంచి సీన్స్ ని పెట్టకపోవడం
అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్స్
కొన్ని ఆసక్తికర సన్నివేశాల మద్య కామెడీ సీన్స్ పెట్టడం

చివరగా : క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ల‌లో ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది, బాస్ ఇస్ బ్యాక్ విత్ బ్యాంగ్…చిరంజీవి అభిమానులకి కనుల పండుగ..వారికి సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చేసింది.

రేటింగ్: 4/5